India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఈరోజు ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో ఆల్ ఇండియా 938వ ర్యాంకు సాధించారు. సాయి అలేఖ్యకు మధిర టౌన్ ఎస్ఐ సంధ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.
భద్రాచలం సీతమ్మ తల్లికి
ప్రత్యేకమైన మూడు సూత్రాల తాళితో కళ్యాణం నవమి నాడు నిర్వహించనున్నారు. పుట్టింటి సూత్రం, మెట్టినింటి సూత్రంతో పాటు రాముని పరమ భక్తుడు భక్తరామదాసు భక్తుల తరఫున ఏర్పాటు చేసిన మూడో సూత్రం కలిపి దేవాలయ అర్చకులు శ్రీరామ నవమి నాడు రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో ఆలయానికి మాత్రమే ఈ తంతు ప్రత్యేకం.
రైతులకు పెద్దమొత్తంలో ఆయిల్ పామ్ మొక్కలను పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మామిడి పంటల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై అధికారులతో మంత్రి చర్చించారు. ఆయిల్ పామ్ కంపెనీల ప్లాంటేషన్ వేగవంతం చేయాలని సూచించారు. ఫుడ్ పార్కులలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. వేసవి సందర్భంగా మార్కెట్ యార్డుల్లో రైతులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
భద్రాచల రామయ్య కళ్యాణానికి వాస్తవంగా శ్వేత అక్షింతలు వాడాలి. కాని శుభ సూచకంగా కొద్దిగా పసుపు కలుపుతారు. కాగా తానీషా ప్రభుత్వం తరపున రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు గులాం పొడి తీసుకుని వచ్చేవారు. తానీషా ప్రభువు తీసుకుని వచ్చిన గులాం పొడి కూడా తలంబ్రాలతో కలపడం వల్ల భద్రాద్రిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఈ తలంబ్రాలను పంచ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 18న (గురువారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కిలారు నరసింహారావు అనే వ్యక్తి మృతి చెందాడు. బేతాళపాడుకి చెందిన కిలారు నరసింహారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు కళ్యాణానికి మిథిలా స్టేడియం వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. అటు పోలీస్ శాఖ 2 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. ఇరు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాద్రి చేరుకుంటున్నారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే సమావేశం నిర్వహిస్తున్నారంటూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్ ఎన్నికల అధికారి వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదుతో పాల్వంచ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.500, పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీసీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందవచ్చు. ఆఫ్లైన్లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.