India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక కోసం స్థానిక ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. రూట్ల వారిగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాటుచేసిన టేబుళ్లు, టేబుళ్లపై పోలింగ్ కేంద్రాల సంఖ్య, పోలింగ్ సిబ్బందికి చేపట్టాల్సిన వసతులపై చర్చించారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం సీతరాముల నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ తలుపులు తీసి రామయ్యకు సుప్రభాత సేవ నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, ఆరాధన, సేవకాలం, నిత్య బలిహరణ మొదలగు నిత్య పూజ కార్యక్రమాలు జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణ వైభవాన్ని కనుల పండువగా నిర్వహించారు.

భద్రాచలం మారుతి కాలేజ్‌లో కారుణ్య మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి కారుణ్య తల్లిదండ్రుల కీలక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. తమ కూతురు మరణానికి, మారుతీ కాలేజ్ నర్సింగ్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆ లెటర్‌లో పేర్కొన్నారు.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీష్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్‌పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న రితీష్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

‘అమ్మా నేను చనిపోతున్నాను … నా కోసం వెతకొద్దు’ అని చెప్పిన నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన మైనర్ బాలిక వరంగల్ – కాజీపేట మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం సారథినగర్‌కు చెందిన బాలిక(17) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాలికతో పాటు ఉన్న యువకుడు అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కిందపడ్డారు. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతిచెందగా యువకుడి కాలు తెగిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.

WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.

నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లు, విత్తన సరఫరా ఏజెన్సీలు, విత్తన డిస్ట్రిబ్యూటర్ లతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. రైతులకు డీలర్లు, ఫెర్టిలైజర్ నకిలీ విత్తనాలను విక్రయించొద్దని హెచ్చరించారు.

లోకసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాoడమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో ఆన్లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాoడమైజేషన్ చేపట్టి పూర్తి చేశారు. కౌంటింగ్ కొరకు రిజర్వ్ తో కలిపి 148 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 173 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 150 మంది సూక్ష్మ పరిశీలకులు నియమించినట్లు చెప్పారు.

భద్రాచలంలోని <<13306910>>మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత<<>> నెలకొంది. విద్యార్థిని కారుణ్య మృతి విషయం తెలుసుకున్న MLA తెల్లం వెంకట్రావ్ కాలేజీకి వచ్చి యజమాన్యంతో మాట్లాడారు. నిందితుల తరఫున వచ్చారా అని విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. కారుణ్య కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేందుకు MLA యత్నించినా వారు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరందరూ శుక్రవారం వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ప్రచార పర్వానికి శనివారం సాయంత్రానికి తెరపడనుంది. సోమవారం ఉదయం 7నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రిలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.