India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 17న జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రాద్రిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండల దృష్ట్యా భక్తులకు సకలసౌకర్యాలు కల్పించాలన్నారు.
సత్తుపల్లి మండలం చంద్రయ్యపాలెం సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్టార్ల భూమి హక్కులపై వివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. మార్చి 31న జరిగిన ఘటనపై గిరిజనులకు అనుకూలంగా విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారటం చర్చనీయాంశమైంది. పోలీసులపై దాడి జరిగినప్పటి నుంచి అప్పటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. దాడి చేసిన వారిని గుర్తించి ఇప్పటివరకు 92 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఖమ్మం: తపాలా బీమా పథకాల ఏజెంట్ల తాత్కాలిక నియామకానికి పదో తరగతి ఉత్తీర్ణులై, 18 ఏళ్లు పైబడిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బి.రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా చేయించేందుకు కమీషన్ పద్ధతిలో నియామకం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు సంబంధిత పత్రాలతో మే 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పాల్వంచ: ఈనెల 28న సూర్యాపేటలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జిల్లా స్పోర్ట్ అథారిటీ మైదానంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 14, 16, 18, 20 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99636 59598ను సంప్రదించాలన్నారు.
చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గూడూరు నవ్య (20) ఖమ్మంలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. కుటుంబ సభ్యులు నవ్యకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నారు. తాను చదువుకోవాలని, పెళ్లి చేసుకోనని నవ్య చెప్పినా తల్లిదండ్రులు వినకపోవడంతో పురుగుమందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
భద్రాచలం పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవారం టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని బ్యాగును పరిశీలించగా 12 కిలోల గంజాయి లభ్యమయింది. వెంటనే నిందితుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
✓పలు శాఖలపై భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
✓వేంసూర్ మండలంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
ఖమ్మం జిల్లాలో గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.6.69 కోట్ల విలువైన విద్యుత్‌ను వినియోగదారులకు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు సంస్థ గుర్తించింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి వచ్చాక ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో అనుసంధానమైన విద్యుత్ కనెక్షన్లకు ఉచిత పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు.
ఖమ్మం మెడికల్ కాలేజి నిర్మాణం కాంట్రాక్టర్, బిల్డింగ్ డిజైన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీఅయ్యారు. తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్స్, ప్రొఫెసర్స్ క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్, క్రీడా మైదానం నిర్మాణం కేటాయించిన స్థల ప్రాంగణంలో ఏ బిల్డింగ్ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే విషయం త్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పాల్వంచ అంబేడ్కర్ సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోమొబైల్ వర్క్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే షాపు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.