India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధిరలోని మైనర్ బాలికను వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మధిర రాయపట్నంకు చెందిన మల్ల కార్తీక్ అనే యువకుడిపై మైనర్ బాలికను వేధించిన కారణంగా పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్సై సంధ్య తెలిపారు.
పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
✓అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓ఖమ్మంలో ఎంపీ రవిచంద్ర పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ముత్యాలగూడెంకు చెందిన చిన్నబాబు(58) ఎండ తీవ్రతకు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అదే విధంగా ఇల్లెందు అడ్డరోడ్డు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రహదారి పక్కనే వడదెబ్బకు గురై మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఖమ్మం జిల్లా రెండవ స్థానంలో ఉంది. నేలకొండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వేంసూరులో 41.2 ఉష్ణోగ్రత నమోదయింది. మార్చి నెలలో రాష్ట్రంలో కెల్లా ఖమ్మం జిల్లాలోని అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఆదివారం నీటిని నిలిపివేశారు. ఈనెల 1వ తేదీ నుంచి వారం రోజులపాటు కాలువకు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆయకట్టు పరిధిలోని తాగునీటి కోసం పెద్ద దేవులపల్లి చెరువుతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నింపేందుకు వారం రోజుల్లో 2.23 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.
భద్రాచలంలో ఈనెల 17న జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఉగాది రోజున శాస్త్రోక్తాoగా అంకురార్పణ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పనులన్నీ పూర్తి కాగా ఆదివారం రాత్రి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కాగా మంగళవారం నుంచి ఈనెల 23 వరకు స్వామివారి నిత్య కళ్యాణం, పవళింపు సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు వెల్లడించారు.
శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో భక్తులు వచ్చే పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రామభక్తులు అసహన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం MLA వెంకట్రావు పొంగులేటి అనుచరుడిగా గుర్తింపు పొందారు. 2014లో వైసీపీ తరఫున మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలం అసెంబ్లీ స్థానం బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. గతేడాది జులైలో కాంగ్రెస్‌లో చేరారు. టికెట్ కష్టమని భావించి మళ్లీ ఆగస్టులో సొంతగూటికి చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.