India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బూర్గంపాడు: ఇటీవల ప్రకటించిన పోలీసు నియామకాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు పోలీసులు ఉద్యోగాలు వరించాయి. అంబేద్కర్ కాలనీకి చెందిన కేసుపాక నాగేశ్వరరావు రాజ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో భాస్కరరావుకు గతంలో పోలీసు ఉద్యోగం రాగా, ప్రసాద్ రావు, రఘురామ్‌లకు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో పోలీసు శాఖలో ఉద్యోగాలు లభించడం పట్ల గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు.
2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు.
చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. నగరంలోని బల్లేపల్లిలో నివాసం ఉంటున్న వినయ్ (27) మార్బుల్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఖానాపురం పోలీస్ స్టేషన్ సీఐ భాను ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని, రాహుల్ గాంధీ సెక్యులర్ సిద్ధాంతాలో పనిచేస్తున్నారని అన్నారు. BRS నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా.. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం లోక్ సభ ఎన్నికకు BRS, BJP నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. కానీ కాంగ్రెస్‌లో టికెట్ పంచాయతీ తెగకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తన భార్యకు టికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండగా.. తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడికే టికెట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరుతున్నట్లు స్థానికుల్లో చర్చ నడుస్తోంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 16 సెక్టార్లు ఏర్పాటు చేస్తామని, రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్ లు సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
శాంతిభద్రతల సమస్యలకు సంబంధించి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రవేశపెట్టిన డయల్ 100కు మార్చి నెలలో 4,205 మంది ఫోన్ చేశారని సీపీ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 75 ఫోన్లకు సంబంధించి FIRలు నమోదు చేశామని వెల్లడించారు. వీటిలో మహిళలపై వేధింపులు, చోరీలు, ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు వంటివి ఉన్నాయని తెలిపారు.
ప్రేమ విఫలమై జీవితంపై విరక్తి చెందిన ఓ డెలివరీ బాయ్ సూసైడ్ చేసుకొన్న ఘటన HYD కూకట్‌పల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన షేక్ షాజహాన్(30) భాగ్యనగర్‌కాలనీలో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అతడి ప్రేమను అమ్మాయి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉరివేసుకొన్నాడు.
జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. శిశు మరణాలపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలని, చిన్న పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని పీహెచ్సీకి తరలించాలని సూచించారు. డీఎంహెచ్ఓ జీవీఎల్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, డీఐఈఓ బాలాజీ, సర్వజన ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నర్సింహారావు తదితరులతో సమీక్ష నిర్వహించారు.
ములకలపల్లి మండలం చింతలపాడులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ పూరపై దాడి చేశారు. వివరాలిలా.. విధి నిర్వహణలో భాగంగా పూర ధర్మన్న సాగర్ శివారు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆదివాసీలు తమ పంటలకు అడవిలోని కుంట నీళ్లు వాడుతుండడంతో అధికారి మందలించారు. దీంతో ఆయన తలపై పారతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రాజమౌళి కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.