Khammam

News April 2, 2024

ఖమ్మం: తీవ్ర ఎండల నేపథ్యంలో హెల్ప్ సెంటర్ ఏర్పాటు

image

ఖమ్మం జిల్లాలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రత్యేకంగా 24 గంటల పాటు పని చేసేలా హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా వడదెబ్బకు గురైనా, ఎండకు అపస్మారక స్థితికి చేరుకున్నా సమాచారాన్ని జిల్లా కేంద్రంలోని 8501003838, 8639522447 నంబరుకు తెలియజేస్తే తక్షణమే అందుబాటులో ఉన్న అంబులెన్సుతో పాటు వైద్య చికిత్సలకు దగ్గరలోని పీహెచ్సీకి తరలించి చికిత్సలు అందిస్తామని జిల్లా వైద్యాధికారులు తెలియజేశారు.

News April 2, 2024

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో వసూలైన ఆదాయ వివరాలు

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లలో వసూలైన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం మార్కెట్ రూ.2,761 లక్షలు, వైరా మార్కెట్ రూ.578.59లక్షలు, కల్లూరు మార్కెట్ రూ.484.25 లక్షలు, సత్తుపల్లి మార్కెట్ రూ.478.37 లక్షలు, మధిర మార్కెట్ పరిధిలో రూ.455.03 లక్షలు, ఏన్కూరు మార్కెట్ రూ.449.99 లక్షలు నేలకొండపల్లి మార్కెట్ రూ.391.08లక్షలు, మద్దులపల్లికి రూ.182.39లక్షల ఆదాయం నమోదైంది.

News April 2, 2024

అత్యధికంగా ఖమ్మం మార్కెట్ రూ.2,761లక్షలు వసూలు

image

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో తాజాగా లక్ష్యాన్ని మించి ఆదాయం నమోదైంది. ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎనిమిది మార్కెట్ల ద్వారా ఆదాయ లక్ష్యం రూ.5,439.72 లక్షలు కాగా, రూ.5,780.70 లక్షలు వసూలయ్యాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం మార్కెట్ నుంచి రూ.2,614 లక్షలకు రూ.2,761లక్షలు వసూలయ్యాయి. కాగా, గత ఏడాదితో పోలిస్తే మార్కెటింగ్ శాఖకు రూ.8లక్షల మేర ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు.

News April 2, 2024

లోక్ సభ పోలింగ్ కు 9,972 మంది సిబ్బంది

image

లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులకు కేటాయింపు కొలిక్కి వస్తోంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 1,456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో విధులు నిర్వర్తించేందుకు 7,280మంది ఉద్యోగులు అవసరం ఉండగా, అదనంగా 20శాతం మందితో కలిపి 9,972మందికి శిక్షణ ఇస్తున్నారు. కాగా, ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఈసారి ఐదుగురు ఉన్నతాధికారులను కేటాయిస్తున్నట్లు తెలిసింది.

News April 2, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,375 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.25 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News April 2, 2024

జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఎండలు

image

చుంచుపల్లి: వేసవికాలం ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సోమవారం సూర్యుడు భగ్గుమన్నాడు. కొత్తగూడెం పరిధిలోని గరిమెళ్లపాడు, భద్రాచలం సబ్‌ కలెక్టరేట్‌ ఏరియాల్లో 41.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాత కొత్తగూడెంలో 40.5, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌లో 40.4, సీతారాంపట్నం, యానంబైలులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు

News April 2, 2024

భారీగా మద్యం అమ్మకాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, 3 క్లబ్బులున్నాయి. వీటి పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు రూ.2,700 కోట్లు. వీటిలో 29.11 లక్షల లిక్కర్‌ కేసులు, 20.10 లక్షల బీర్ల కేసుల విక్రయాలు జరిగాయి. నూతన వ్యాపారులు డిసెంబరు నుంచి మార్చి వరకు నాలుగు నెలల్లోనే రూ.వెయ్యి కోట్లకు మించిన మద్యం అమ్మకాలు చేయడం మరో విశేషం.

News April 2, 2024

KMM: 3 నుంచి ‘ పది ‘ జవాబుపత్రాల మూల్యాంకనం

image

టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంకు ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది 2,18,980 పత్రాలను ఇక్కడ దిద్దగా ఈసంవత్సరం 2,10,480 పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. గత సంవత్సరం జవాబు పత్రాలు అధికంగా ఉండటంతో భద్రాద్రి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఈసారి కేవలం ఖమ్మం జిల్లాకు చెందినవారు మాత్రమే ఈకార్యక్రమంలో పాల్గొనున్నారు.

News April 2, 2024

దళిత బంధు యూనిట్లు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

చింతకాని మండలం నందు 25 గ్రామ పంచాయతీలకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లు వివిధ వాహనాలు ఇతరులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. లబ్ధిదారుని వివరాలను సేకరించి సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

News April 1, 2024

లారీని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి పరిస్థితి విషమం

image

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు వద్ద ఓ లారీని సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే ఐటీసీ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్ల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!