Khammam

News May 11, 2024

REWIND.. 2019లో పార్టీల వారీగా ఓట్లిలా..

image

2019లో జరిగిన ఎన్నికల్లో నామా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 1,60,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల వివరాలిలా..
నామా నాగేశ్వరరావు (బీఆర్ఎస్) – 5,67,459,
రేణుకా చౌదరి (కాంగ్రెస్) – 3,99,397,
బోడ వెంకట్ (సీపీఎం) – 57,102,
దేవకి వాసుదేవరావు (బీజేపీ) – 20,488,
నరాల సత్యనారాయణ (జనసేన) – 19,315.

News May 11, 2024

ఖమ్మం: 4గంటలకే ప్రచారం బంద్ 

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో ఈరోజు సా.4 గంటలకే ప్రచారం ముగియనుంది. మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం.. ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సా.4 గంటలకే ప్రచారం ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. 

News May 11, 2024

నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెర..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News May 11, 2024

REWIND.. ఖమ్మం నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు

image

ఖమ్మం లోక్ సభకు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 11 సార్లు గెలిచింది. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. కాంగ్రెస్ నుంచి లక్ష్మీ కాంతమ్మ హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి గెలిచిన జలగం వెంగళరావు, పీవీ రంగయ్యనాయుడు, రేణుకాచౌదరి కేంద్ర మంత్రి పదువులు చేపట్టారు. సిట్టింగ్ ఎంపీ నామా బీఆర్ఎస్, టీడీపీ నుంచి ఒక్కోసారి ఎంపీగా ఉన్నారు.

News May 11, 2024

ఇప్పటివరకు రూ.2కోట్లకు పైగా నగదు సీజ్

image

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని లాడ్జీలు, హాటళ్లలో పోలీసులు సోదాలు చేస్తూ అపరిచిత వ్యక్తులు ఉంటే ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు రూ.2కోట్లకు పైగా నగదును సీజ్ చేయగా, పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త తనిఖీల్లో రూ.కోటి పైగా విలువైన మద్యం, రూ.20లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే, చివరి 2 రోజులు మరింత కీలకం కావడంతో తనిఖీలు ముమ్మరం చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది.

News May 11, 2024

ఓటర్ స్లిప్పు రాలేదా.. ఆందోళన వద్దు

image

ఖమ్మం: ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఓటర్ స్లిప్పు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే స్లిప్పు రాకుండా ఒక ఎస్ఎంఎస్ తో పోలింగ్ బూతులో ఓటు ఉందో లేదో సులభంగా తెలుసుకొని అవకాశం ఉంది. ఓటరు తన ఫోను నుంచి ఈ సీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డు నెంబరు నమోదు చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు మెసేజ్ పంపించాలి. వెంటనే పోలింగ్ బూత్ నెంబర్ ఓటర్ జాబితాలోని క్రమసంఖ్య వివరాలతో మెసేజ్ వస్తుంది.

News May 11, 2024

ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు

image

పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సంబంధిత కలెక్టరేట్లలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు కలెక్టర్, ఇతర ఎన్నికల సిబ్బంది పర్యవేక్షించటానికి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, తనిఖీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నిఘానేత్రాల ద్వారా అక్కడి తంతును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

News May 11, 2024

కొత్తగూడెం: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

image

ఉరేసుకుని యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుండెపూడిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిసిన వివరాలిలా.. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బిందు(21) ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరేసుకుంది. బయటకు వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి విగతజీవిగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 11, 2024

ఖమ్మం: ’63 మంది నామినేషన్ చెల్లుబాటు’

image

NLG-WGL-KMM జిల్లాల పట్టభద్రుల MLC బై పోల్‌కు 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్‌ అధికారి హరిచందన తెలిపారు. 6 నామినేషన్లు తిరస్కరించినట్లు వెల్లడించారు. 63మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుందన్నారు. ఈ నెల 27న పోలింగ్, జూన్‌ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.

News May 11, 2024

KTDM: ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లా గంగలోర్ పీఎస్ పరిధిలోని పీడీయా  అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే మరింత అవకాశం ఉందని తెలిసింది. అలాగే మృతి చెందిన వారిలో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం.