India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. పత్తి జండా పాట క్వింటా రూ.7125, ఏసీ మిర్చి క్వింటా జండా పాట రూ.21100, నాన్ ఏసీ మిర్చి జండా పాట క్వింటా రూ.18 వేలు ధర పలికినట్లు వెల్లడించారు. ధరలు స్వల్పంగా పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి నిన్నటి కంటే రూ.25 పెరగగా, ఏసీ మిర్చి 600 పెరిగింది. నాన్ ఏసీ మిర్చి ధర నిలకడగా ఉంది.

ఖమ్మం లోక్ సభ స్థానంలో 16,31,039 మంది, మహబూబాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో 15,30,367 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరినీ ప్రత్యక్షంగా కలవటం సాధ్యం కాకపోవటంతో ఎంపీ అభ్యర్థుల వాయిస్‌తో ఫోన్ కాల్స్ ద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే మీకూ కాల్స్ వస్తున్నాయా.. కామెంట్ చేయండి.

లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు చివరి ఘట్టానికి చేరుకుంది. ఖమ్మం జిల్లా పరిధిలోని 5అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు, భద్రాద్రి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకే ముగియనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు సాగిస్తూనే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఖమ్మం <<13215602>>మున్నేరులో పడి గురువారం ముగ్గురు చిన్నారులు మృతి<<>> చెందిన ఘటన తెలిసిందే. అయితే.. గురువారం మధ్యాహ్నం భోజనం చేశాక పక్క ఇంట్లో ఆడుకుంటానని గణేష్ తన తల్లి కళావతికి చెప్పి వెళ్లాడు. ఈతకని చెబితే వెళ్లనివ్వరని అలా చెప్పినట్లు తెలుస్తోంది. తీరా నీట మునిగి గణేశ్ మృతి చెందినట్లు సమాచారం అందడంతో కళావతి అక్కడకు చేరుకుని కొడుకు మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

∆} ఖమ్మంలో ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ
∆} వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరు మండలంలో బీఆర్ఎస్ రోడ్ షో కార్నర్ మీటింగ్
∆} కూసుమంచి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనం
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఖమ్మం జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు, క్యాడర్ కలిగిన పార్టీగా TDPకి చరిత్ర ఉంది. ఆ పార్టీ మద్దతిచ్చిన వారు ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ. గత ఎన్నికల్లో వారు హస్తం పార్టీకి సపోర్ట్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో జిల్లా నాయకత్వం ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. కానీ తెలుగు తమ్ముళ్లు తలో దారి చూసుకోవడంతో టీడీపీ వర్గాలుగా చీలిపోయింది. మరి జిల్లా నాయకత్వం కార్యకర్తలను సమన్వయం చేస్తుందో లేదో చూడాలి!

స్వీప్ కార్యాచరణలో భాగంగా ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిచే బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకొనేల అవగాహన, చైతన్యం కొరకు ఈ ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన అన్నారు.

పిడుగుపాటుకు 17 గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన పాల్వంచ మండల పరిధి బిక్కు తండా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మున్సిపల్ పరిధి వెంగళరావు కాలనీకి చెందిన వేల్పుల పెద్దిరాజు మేతకు తన గొర్రెలను మండల పరిధి బిక్కు తండా ప్రాంతానికి తీసుకెళ్లాడు. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి తోడు పిడుగు పడడంతో 17 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెంలో జరిగింది. టీడీపీ ఎంపీటీసీ పాయం దేవి కుమారుడు పాయం జితేంద్ర(15) నెల్లిపాక గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి గేదెలను ఇంటికి తోలుకుని వస్తూ ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. బాలుడి తలిదండ్రుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటును బహిష్కరిస్తున్నామని గరిమెళ్ళపాడు గ్రామానికి చెందిన ఆదివాసీలు బ్యానర్ల ద్వారా తమ సమస్యలను విన్నవించారు. దీనిపై స్పందించిన పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు వారిని కలిసి మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఓటు బహిష్కరిస్తున్నామని ప్రకటించినట్లు వారు చెప్పారు. ఏళ్ల నాటి తమ భూములపై హక్కులు, ఐటీడీఏ నర్సరీలో ఉద్యోగాలు కల్పించాలని అధికారులను కోరారు.
Sorry, no posts matched your criteria.