India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యాక ఆధారాలు లేకుండా తరలిస్తున్న వివిధ రకాల సామగ్రిని సీజ్ చేసినట్లు నోడల్ అధికారి మురళీధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గురువారం నాటికి 56 కేసులు నమోదు కాగా రూ.3,52,133విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇందులో రూ.50,400 విలువైన పీడీఎస్ బియ్యం, రూ.72,464 విలువైన గంజాయి, రూ.2,29,269 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. యువకుడి వయసు సుమారు 21 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ యువకుడు మరణించిన ఘటన ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో చోటుచేసుకుంది. బత్తిని నిఖిల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లికి ఆ యువకి ససేమిరా అనడంతో మనస్తాపంతో వారం క్రితం ఎలుకల మందు తాగాడు. దీంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లో నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు.
∆} మ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ కార్డుల పంపిణీ ప్రక్రియను తపాలాశాఖ మొదలు పెట్టింది. ఐదు నియోజకవర్గాలలో మొత్తం 37 వేల కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం ప్రధాన తపాలా కార్యాలయానికి చేరిన కార్డులను స్పీడ్ పోస్ట్ ద్వారా అందించే కసరత్తును పోస్టల్ శాఖ ప్రారంభించింది.
రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మాట్లాడుతూ.. ‘ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. నా వద్ద ధరణికి చెందిన మరింత సమాచారం ఉంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఉండదు.’ అంటూ కీలక నిర్ణయాలు వెల్లడించారు.
రజాకార్ సినిమా బృందానికి గురువారం బయ్యారం మండలం కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినిమా నటి అనసూయ అమరవీరుల స్తూపానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, మండల కళాకారులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
కుక్కునూరు, కూనవరం, విఆర్ పురం, ఐ పోలవరం, చింతూరు, ఎటుపా, రాజవొమ్మంగి మండలాల్లో ఇప్పటి వరకు గిరిజనులు 50 సింగిల్ బార్ తుపాకులను వివిధ పోలీస్టేషన్లలో అందజేశారని ఎఎస్పీ జగదీష్ అన్నారు. రాజవొమ్మంగి పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారభించారు. ఆయుధాల నియంత్రణ చట్టం ప్రకారం నిషేధిత తుపాకులు కలిగి ఉండడం నేరమని, ఇకపై తుపాకీతో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.