Khammam

News May 8, 2024

త్వరలో రైతు భరోసా: తుమ్మల

image

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని.. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని వ్యాఖ్యానించారు.

News May 8, 2024

దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డుపై కోతుల కారణంగా మహిళ మృతిచెందిన సంఘటన దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. గండుగులపల్లికి చెందిన సునీత(24) అనే మహిళ భర్త పిల్లలతో కలిసి ములకలపల్లి వెళ్తుండగా సుదాపల్లి గ్రామశివారులో రోడ్డుపై ఉన్న కోతుల మంద ఒక్కసారిగా దాడికి యత్నించటంతో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో సునీత తలకు తీవ్రగాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 8, 2024

ఖమ్మం: ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి ఘటన బుధవారం కారేపల్లి మండలం పోలంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.రాజా రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందుకి చెందిన ముళ్లపాటి శ్రీనివాస్(55) పోలంపల్లి సమీపంలో ఇటుక బట్టి నిర్వహిస్తున్నాడు. ట్రాక్టర్ తీసుకొని ఇంటికి వెళుతుండగా పోలంపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో శ్రీనివాసరావుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News May 8, 2024

పాల్వంచలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

పాల్వంచలోని సీతారాంపట్నంకు చెందిన బోళ్ళ శ్రీనివాసరావు కిరాణా షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం శ్రీనివాసరావు ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసరావుకు భార్య రాధిక, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు.

News May 8, 2024

కేంద్రంలో మోదీ అరాచక పాలన సాగిస్తున్నారు: రేణుకా చౌదరి

image

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోదీ అరాచక పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి విమర్శించారు. బుధవారం నగరంలోని శ్రీశ్రీ హోటల్‌లో జరిగిన ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి హాజరై ప్రసంగించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు.

News May 8, 2024

‘మహిళలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’

image

DRDO, DWO, MEPMA వారి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఓటర్ అవేర్నెస్ ‘స్వీప్’ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పాల్గొని మహిళల అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు

News May 8, 2024

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: తుమ్మల

image

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఖమ్మంలో కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తమ్మల మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులెవరూ అధైర్యపడవద్దని.. ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని అన్నారు.

News May 8, 2024

ఎంపీగా గెలిపిస్తే విమానాశ్రయం తెస్తా: తాండ్ర

image

కేంద్ర ప్రభుత్వం వందల పథకాలు అమలు చేస్తుంటే ఆ పథకాలు కొత్తగూడెం ప్రజలకు అందించే నాయకుడు లేరని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తాండ్ర వినోద్ రావు మాట్లాడారు. తాను ఎంపీగా గెలిస్తే కొత్తగూడెం పట్టణానికి విమానాశ్రయం తెస్తానన్నారు. మోడీ లాగే తనకు రాజకీయ వారసులు లేరని, సేవ చేయడం కోసమే వచ్చానని చెప్పారు.

News May 8, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వేసవి సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వేసవి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 (మంగళవారం) నుంచి వచ్చే నెల 5 (బుధవారం) వరకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 6 గురువారం నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. ఎండల తీవ్రత, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులు గమనించాలన్నారు.

News May 8, 2024

ఖమ్మం: మండుటెండలోనూ.. తగ్గేదేలే!

image

మండుటెండను లెక్కచేయకుండా లోక్​ సభకు పోటీ చేసే అభ్యర్థులతో పాటు ప్రధానపార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి 4 రోజులే టైం ఉండడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్​ అభ్యర్థి రాఘురాంరెడ్డి, బీఆర్ఎస్​ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి వినోదరావులు తమ గెలుపుకు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.