Khammam

News May 8, 2024

పట్టభద్రుల స్థానానికి 14 నామినేషన్లు

image

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నందిపాటి జానయ్య, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీ ఈడ శేషగిరిరావు, శ్రమజీవి పార్టీ జాజుల భాస్కర్, యువతరం పార్టీ నుంచి బండారు నాగరాజు నామినేషన్లు సమర్పించారు. అలాగే, మిగతా వారు స్వతంత్రులుగా నామినేషన్ వేశారు.

News May 8, 2024

ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం

image

ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం నుంచి ప్రతిరోజు ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురుస్తుంది. దీంతో చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోంది. పలుచోట్ల ఇళ్ల కప్పులు లేచిపోవడమే కాక విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడంతో ఆస్తి నష్టం జరుగుతోంది. మంగళవారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో 309 విద్యుత్ స్తంభాలు, తొమ్మిది ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

News May 8, 2024

ఖమ్మాన్ని నా కుతూరు లాగా జాగ్రత్తగా చూసుకుంటాడు: వెంకటేశ్

image

రఘురాంరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం ప్రజలను తన కుతూరు లాగా జాగ్రత్తగా చూసుకుంటారని సినీ హీరో వెంకటేశ్ అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైనవారు డైలాగ్‌ చెప్పాలని కోరగా, ‘డైలాగ్‌లు సినిమాలకే పరిమితం. ఇప్పుడంతా ఒకటే డైలాగ్‌. 13న పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి. రఘురాం రెడ్డికి ఓటెయ్యాలి. అంతే..!’ అని తనదైన శైలిలో చెప్పారు

News May 8, 2024

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి:కలెక్టర్ 

image

ఖమ్మం: జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడిఓలు, మునిసిపల్ కమీషనర్లు, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీర్లతో త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా అధికారులు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

News May 7, 2024

ఖమ్మంలో రఘురాం రెడ్డి గెలుపు ఖాయం: సినీ హీరో వెంకటేష్

image

ఈవీఎంలో మూడో నెంబర్ గుర్తుందా.. అదేనండీ మన గుర్తు అంటూ.. మంగళవారం ఖమ్మం నగరంలో జరిగిన రోడ్డు షోలో సినీ హీరో వెంకటేష్ అన్నారు. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు గెలుపు ఖాయమన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మన RRRకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోడ్డు షోలో మంత్రి పొంగులేటి ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

News May 7, 2024

పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2024

లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల పరీక్షకు మరో ఆరు రోజులే..!

image

KMM, MHBD పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల పరీక్షకు మరో 6 రోజులే ఉన్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తీరిక లేకుండా ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు విక్టరీ వెంకటేష్ రావడంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. అటు నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.

News May 7, 2024

మంత్రి పొంగులేటిని కలిసిన సినీ హీరో వెంకటేశ్

image

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరఫున ఖమ్మంలో నేడు సినీ హీరో వెంకటేశ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన ఇప్పటికే ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటి అయ్యారు. సాయంత్రం 5 గంటలకి ఖమ్మంలో జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారు.

News May 7, 2024

ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్న విక్టరీ వెంకటేశ్

image

సినీ హీరో విక్టరీ వెంకటేశ్ మంగళవారం ఖమ్మానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఆయనకు పొంగులేటి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం నగరంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

News May 7, 2024

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: అశోక్

image

వరంగల్, ఖమ్మం, నల్లగొండ MLC స్వాతంత్ర్య అభ్యర్థిగా పాలకురి అశోక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆయన రేపు నల్లగొండలో ఆయన నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. లైబ్రరీలు, కార్యాలయాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, పట్టభద్రులు తనను గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అశోక్ పేర్కొన్నారు.