India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం: సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న పేదింటి ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ నెల 7 నుంచి 14 వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు వర్ష సూచన, ఎండ తీవ్రత దృష్ట్యా హమాలీ కార్మికుల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని 8 రోజులపాటు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. పత్తి జండా పాట క్వింటా రూ.7,150, నాన్ ఎసీ మిర్చి ధర క్వింటా రూ.18,000, ఏసీ మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలికినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజులుగా రూ.50 నుంచి 300 వరకు హెచ్చుతగ్గుల మధ్య ధర కొనసాగుతోంది. ఏసీ మిర్చికి స్వల్పంగా ధర పెరుగుతోంది.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు కారేపల్లిలో 14.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం ఖానాపురం వద్ద 13 మి.మీ., కామేపల్లి మండలం లింగాల 8, ఖమ్మం ప్రకాష్ నగర్ 7, రఘునాథపాలెం, పమ్మిలో 4.8, పంగిడిలో 4.5, నేలకొండపల్లిలో 3.5, నాగులవంచలో 2.8, చింతకానిలో 2.3, కొణిజర్లలో 1.5, ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ 0.8, బాణాపురం, బచ్చోడులలో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో వాతవరణం చల్లబడింది.

గుండెపోటుతో యువతి మృతిచెందిన ఘటన కలకోటలో శనివారం రాత్రి జరిగింది. కలకోటకి చెందిన మౌనిక(27) ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసి అవనిగడ్డలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. అనారోగ్యానికి గురవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు.

భద్రాచలంలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృత్యువాత పడ్డారు. సుభాష్ నగర్ కాలనీకి చెందిన 9వ తరగతి విద్యార్థి చింతకాయల సంజయ్ (15) శనివారం సాయంత్రం వడదెబ్బ తగిలి వాంతులు, విరోచనాలు అవ్వడంతో చికిత్స అందిస్తుండగా ఆదివారం మృతి చెందాడు. అలాగే రాజుపేట కాలనీకి చెందిన కే.లక్ష్మయ్య ఎలక్ట్రీషియన్. ఆదివారం పని అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేస్తుంటే.. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ పోటాపోటీగా ప్రచారాలు చేస్తుండడంతో.. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు, ర్యాలీలూ, సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.

MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మం పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.
Sorry, no posts matched your criteria.