India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మం పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.

ఈవిఎంల కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవిఎం, వివిప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈక్రమంలో సిబ్బందికి ఆయన సలహాలు సూచనలు చేసారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.

డీప్ ఫేక్ ఆడియోలు సమాజానికి పెను ముప్పుగా మారుతున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. గత కొంతకాలంగా తనపై కూడా అసత్య ప్రచారాలు జరిగినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పువ్వాడ హెచ్చరించారు. దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆయా పార్టీల నాయకుల డీప్ ఫేక్ ఆడియోలు, వీడియోలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.

ఖమ్మం ఇల్లందు రోడ్డులో గల ఓ జిమ్‌లో సినీ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత, మంత్రి పొంగులేటి కుమార్తె స్వప్ని రెడ్డి ప్రచారం నిర్వహించారు. సీపీఐ, సీపీఎం బలపరిచిన ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ క్యాంపెయిన్ చేశారు. వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

ఖమ్మంలో హీరో వెంకటేశ్ క్యాంపెయిన్ షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం 5గంటలకు మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు కొత్తగూడెంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో ప్రారంభమవుతుంది. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. ఏర్పాట్లను డీఈవో సోమశేఖరశర్మ, రెండు జిల్లాల కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు పర్యవేక్షిస్తున్నారు.

ఈ వేసవిలో నానాటికీ ఎండలు పెరుగుతున్నాయి. పలువురు వడదెబ్బ బారిన పడి చికిత్స పొందుతుండగా ఇంకొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే, వడదెబ్బ మృతుల్లో పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందుతుంది. ఇందుకోసం ప్రతీ మండలానికి త్రిసభ్య కమిటీని నియమించగా.. వీరు విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం రూ.50 వేలు పరిహారం మంజూరు చేస్తారు.

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.
Sorry, no posts matched your criteria.