India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు రాయడానికి హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా రాయాలన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు. కాబట్టి వాహనదారులను ఎవరైనా విద్యార్థులు లిఫ్ట్ అడిగితే దయచేసి వారికి లిఫ్ట్ ఇచ్చి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరేందుకు సహకరించండి. >>>SHARE IT
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కాగా, త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు.
ఈసారి ఎన్నికల్లో డబ్బు, శరీర బలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. కానీ ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. ఎగ్జామ్ హాలులోకి అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.
ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొనిజర్లలో జరిగింది. కొణిజర్ల నుంచి మల్లుపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మల్లుపల్లికి చెందిన ఉపేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎండలు మండిపోతుండడంతో ప్రజలు చల్లని నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ లో నీటిని తాగడంతో అనేక సమస్యలు తలెత్తుతుండడంతో ఆరోగ్యం కోసం మట్టికుండల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ కొనుగోలు చేయలేని పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు నగరంలోని ప్రధాన వీధుల్లో వ్యాపారులు పలు రకాల కుండలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
కల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అక్కడకు సుజాతనగర్‌కు చెందిన ఇద్దరు వచ్చారు. ఆ వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో విషయం బయటకు వచ్చింది. గతంలో ఇదే ఇంటి వద్ద ఇదే ఘటనపై కేసు నమోదైంది. దీంతో ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షాకీర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.