India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్తగూడెంలో కాంగ్రెస్ బహిరంగ సభకు వచ్చిన సీఎం రేవంత్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను ఆపారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలకు సహకరించారు. కొత్తగూడెంలో బహిరంగ సభకు సీఎం హెలికాప్టర్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. హెలిప్యాడ్ నుంచి సభ వద్దకు చేర్చడానికి, సభ నుంచి హెలిప్యాడ్ వద్దకు సీఎంను చేర్చేందుకు కాన్వాయ్ అవసరం ఉంటుంది.

చర్ల సరిహద్దు బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి వడిగట్టారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మడవి ఉంగ, మడవి జోగా అనే ఇద్దరు గిరిజన సోదరులను శనివారం హతమార్చారు. టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుత్వాయి గ్రామానికి చెందిన ఆ ఇద్దరిని సమీప అటవీ ప్రాంతంలోకి పిలిచి ప్రజాకోర్టు నిర్వహించి సోదరులకు మరణశిక్ష విధించారు. దీన్ని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ధ్రువీకరించారు.

ఖమ్మం పార్లమెంట్ ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడేనికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కొద్దిసేపటి క్రితం ప్రగతి మైదాన్లో దిగారు. ప్రకాశం స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకున్నారు.

స్నానం చేస్తూ కాలువలో జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చంద్రుగొండ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథన ప్రకారం.. మండలంలోని బెండలపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు కాలువ కూలీ పనులకు ఒడిశా నుంచి కొంతమంది వచ్చారు. కాలువలో స్నానం చేస్తుండగా జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండోరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. రెండోరోజు నలుగురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది.

ఖమ్మం జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రణక్షేత్రంలా సాగుతోంది. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు ప్రచార జోరును పెంచారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల కరపత్రాలు, గుర్తులతో రూపొందించిన ఫ్లకార్డులను చేతబూని తమ అభ్యర్థికి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఇక సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్లుగా బీర్ల నిల్వలు లేవు. ఉభయ జిల్లాల్లో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, మూడు క్లబ్స్ ఉన్నాయి. అయితే గతేడాది మే మొదటి, రెండు వారాల్లో 48 వేల లిక్కర్ కేసులు, లక్ష బీర్ల కేసులను దుకాణాలకు విక్రయించారు. వీటి విలువ రూ.50 కోట్లు. ఈసారి బీర్లకు డిమాండ్ అమాంతం పెరగటంతో ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఏప్రిల్లో రూ.181 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా రాచపట్నంకు చెందిన నాగరాజు, భార్య లావణ్య(40) కొద్దిరోజుల క్రితం తుంబూరు శివారులోని కిషోర్ రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో కాపలాకు వచ్చారు. అయితే గురువారం రాత్రి లావణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్ తెలిపారు.

> తిరుమలాయపాలెంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యటన
> కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
> సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> కామేపల్లిలో సీపీఎం మండల కమిటీ సమావేశం
> ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
> కూసుమంచిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
Sorry, no posts matched your criteria.