India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పూనం జగ్గయ్య(65) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, BJP జిల్లా నాయకులు పోడియం బాలరాజు సందర్శించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ కార్యదర్శి గౌస్ పాషా పాల్గొన్నారు.
సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేరు వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామ నవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుండి క్రమక్రమంగా భక్తుల పెరుగుతోంది. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది.
చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం.. సత్తుపల్లిలోని తామర చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని అటుగా వెళుతున్న స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉదయం 9:30 గంటల తర్వాత శంఖ, చక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేస్తారు. అనంతరం పూజలు చేస్తారు. సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆపై కళ్యాణం కోసం తయారుచేసిన వస్త్రాలను ధరింప చేస్తారు. లక్ష్మణుడికి రామ మాడను ధరింప చేస్తారు.
అశ్వాపురం మండలంలోని కళ్యాణపురంలో ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికులు దాడి చేశాడు. తోటి ప్రయాణికుల వివరాల ప్రకారం.. ఖమ్మం మీదుగా వస్తున్న బస్సులో కళ్యాణపురం గ్రామస్థులు ఎక్కారు. స్టాప్ వద్దకు రాగానే బస్ డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు వెళ్లాడు. దాంతో ప్రయాణికులకి, బస్ డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణపురంలో బస్సును ఆపి అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్, కండక్టర్‌పై చేయి చేసుకున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. చైత్ర శుద్ధ నవమి అభిషేక్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. తరువాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుక కీలక ఘట్టం ముగుస్తుంది.
కల్లూరు చెందిన దంపతులు మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. బియ్యం వ్యాపారి చల్ల నరసింహారావు, ఆయన భార్య పుష్పావతి(40) ఇంట్లోనే పురుగుల మందు తాగారు. స్థానికులు చూసేసరికి పుష్పావతి మృతి చెంది ఉంది. నరసింహారావును ఆసుపత్రికి తరలించారు. ఎస్సై షాకీర్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.
చండ్రుగొండ మండలంలోని ఓ మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు దానికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోక్సో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాలెంకి చెందిన సాంబశివరావు, సంగీత్, పెనుబల్లి మండలం చిన్నమ్మ గూడెంకు చెందిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు చండ్రుగొండ ఎస్ఐ మాచినేని రవి తెలిపారు.
శ్రీరామనవమి వేడుకల బందోబస్తులో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ రోహిత్‌రాజ్ సిబ్బందికి సూచించారు. భద్రాచలం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీలు సాయిమనోహర్, పరితోష్ పంకజ్, ఏఆర్ ఏఎస్పీ విజయబాబు, ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో ఖమ్మంలోని పటేల్ స్టేడియం, కొత్తగూడెంలోని గౌతంపూర్ మైదానంలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. భద్రాద్రి జిల్లా బాలబాలికలు www.hydcricket Asssociation (HCA) వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఖమ్మం జిల్లాకు సంబంధించి నెట్స్ మేనేజర్ ఎం.డీ.ఫారూఖ్‌ను సంప్రదించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.