Khammam

News May 1, 2024

బీఆర్ఎస్‌ని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం: భట్టి

image

గత ఎన్నికలో అప్రజాస్వామిక బీఆర్ఎస్ పార్టీని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క అన్నారు. మధిరలో జరిగిన పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు మాసాల్లోనే తాము చెప్పిన గ్యారంటీలను అమలు చేసి చూపించామన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించారు.

News April 30, 2024

ఆటోను ఢీకొన్న లారీ, ఆటో డ్రైవర్ మృతి

image

ఆటోను లారీ ఢీకొట్టగా ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గోసు గోపయ్య(42) ఆటో డ్రైవర్ గా
పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఖమ్మం నుంచి వెంకటగిరి వస్తుండగా మార్గమధ్యలో లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 30, 2024

మంత్రి తుమ్మలతో రేవంత్ రెడ్డి భేటీ

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో హైదరాబాదులోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి పాల్గొన్నారు.

News April 30, 2024

జిల్లాలను తగ్గిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం: KCR

image

గిరిజన బిడ్డలకు పాలన అందాలని కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేశాం, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను తగ్గిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

News April 30, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి వినూత్న ప్రచారం 

image

“అమ్మా.. బావున్నారా?. వ్యాపారం ఎలా నడుస్తోంది.. గిట్టుబాటు అవుతోందా..” అంటూ కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నాగులవంచ గ్రామంలో ఓ చిరు వ్యాపారి మహిళతో ముచ్చటించారు. ప్రచారంలో భాగంగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి మంగళవారం సాయంత్రం టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లారు. స్వయంగా ఆయనే కడాయిలో సమోసాలు వేసి కాల్చారు.

News April 30, 2024

ఖమ్మం: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

ముదిగొండ మండలంలోని బాణాపురంలో విషాదం జరిగింది. తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడు మరికంటి నాగేశ్వరరావు (47) మృతి చెందాడు. కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎక్సైజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. బాధిత కల్లుగీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.

News April 30, 2024

ఖమ్మం: వడ దెబ్బ తగిలి వ్యక్తి మృతి

image

వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన నేలకొండపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాదాసు వెంకయ్య(50) జీవనోపాధి నిమిత్తం గంగిరెద్దులు ఆడిస్తుంటారు. రోజూ లాగే వెళ్లి ఇంటికి వచ్చేసరికి వడ దెబ్బ తగిలింది. ఇంటికి చేరుకున్నాక ఒంట్లో నలతగా ఉందని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News April 30, 2024

పామాయిల్ బోర్డ్ తెప్పించే బాధ్యత నాది: తాండ్ర

image

అశ్వరావుపేటలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రింగ్ రోడ్ నుంచి వెంకట సినీ థియేటర్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్లో అయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఇక్కడ పామాయిల్ బోర్డ్ తెప్పించే బాధ్యత తనదన్నారు.

News April 30, 2024

బీజేపీని ఓడించి ప్ర‌జాప్వామ్యాన్ని కాపాడుకోవాలి: భట్టి

image

కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్య‌ర్థి రామ‌స‌హాయం ర‌ఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఎం కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. మంగళవారం ఖమ్మంలో సీపీఎం నిర్వ‌హించిన పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ విస్తృత‌స్థాయి స‌మావేశంలో పాల్గోని మాట్లాడారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లను కేంద్రం కార్పొరేట్‌కు క‌ట్ట‌బెడుతోందని, బీజేపీని ఓడించి ప్ర‌జాప్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.

News April 30, 2024

ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ ఖిల్లా- డిప్యూటీ సీఎం

image

ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ ఖిల్లా అని, కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కంచు కోటలాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో లేకపోయినా జిల్లాలో కాంగ్రెస్ పట్టు తగ్గకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కొనసాగించారన్నారు. దేశంలో దేశంలోని ప్రజలను మతం పేరుతో విడగొడుతోందని, బీజేపీ, బీఆర్ఎస్‌కు ఘోర పరాజయం తప్పదన్నారు.