India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నగర, పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో ఎర్లీ బర్డ్ స్కీంను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రాయితీతో ఆస్తి పన్ను చెల్లించేందుకు ఎర్లీ బర్డ్ స్కీం ప్రవేశపెట్టారు. ఈ నెలలో పన్ను చెల్లించే వారికి ఈస్కీం ద్వారా 5శాతం రాయితీ లభిస్తుంది. రాయితీతో పన్ను చెల్లించే గడువు మంగళవారం ముగియనుంది. దీంతో వీలైనంత మేరకు పన్నులు వసూలు చేసేలా మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటివరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.

పదో తరగతి ఫలితాల్లో ఖమ్మం 92.24 శాతంతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. ఖమ్మంలో మెత్తం 16,541 మంది పరీక్ష రాయగా 15258 మంది ఉత్తీర్ణులైయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 90.39 శాతంతో 26వ స్థానంలో నిలిచింది. కొత్తగూడెంలో మొత్తం 12,294 మంది పరీక్ష రాయగా.. 11,112 మంది ఉత్తీర్ణులైయ్యారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,650 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.150 పెరగగా.. అటు పత్తి ధర స్థిరంగా ఉన్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులను ఇబ్బందులను గురి చేయకుండా క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. ఖమ్మం జిల్లాలో 16,577 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12341 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

కేసీఆర్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతో సమీక్షించారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ సునామీ ఖాయమని.. 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ఖమ్మం సీటు గెలుస్తున్నామని, మిగతా పార్టీల అభ్యర్థుల కంటే నామ ముందంజలో ఉన్నట్లు సర్వే రిపోర్ట్‌లు చెబుతున్నాయని పేర్కొన్నారు. నేతలంతా కష్టపడి పని చేస్తే మంచి మెజార్టీ వస్తుందని దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి మంత్రులు మల్లు భట్టి, పొంగులేటి, తుమ్మల దిగటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఖమ్మం లోక్‌సభ స్థానం సీటును తమ కుటుంబీకులకు దక్కించుకోవాలని పోటీ పడిన విషయం తెలిసిందే. అనేక సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిత్వం రఘురాంరెడ్డికి దక్కింది. ఈ స్థానంలో మెజార్టీ సాధించాలనే సంకల్పంతో ముగ్గురు ఒకే తాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ప్రకటించారు.

ఖమ్మం నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. పాలేరును ఎండబెట్టిన పాపం మంత్రులదేనన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతాడని పేర్కొన్నారు. నామా కేంద్రంలో మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా మేలు జరిగే అవకాశం ఉందని వివరించారు.

∆} ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో
∆} పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} మధిర నియోజకవర్గం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} కూసుమంచి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} కల్లూరు మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రిలో ప్రత్యేక పూజలు

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఖమ్మంలో 41 నామినేషన్లు ఆమోదించగా.. ఆరుగురు విత్‌డ్రా చేసుకొన్నారు. 35 మంది బరిలో నిలిచారు. MHBD లోక్‌సభలో 25 నామినేషన్లు ఆమోదించగా.. ఇద్దరు విత్ డ్రా చేసుకొన్నారు. 23 మంది బరిలో ఉన్నారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Sorry, no posts matched your criteria.