India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాగర్ జలాలు రాకపోవటం వల్ల ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి పైగా తగ్గింది. గతేడాది 2.20లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా ఈసారి 1.02 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందుకే ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్య కుదించాలని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమవగా, భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ రెండో వారంలో డీసీ మొదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.
అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వైరా ఎంఈఓ కే.వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు.. అష్ణగుర్తి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్‌జీటీ వై.మధుబాబు తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు సెలవు పెట్టారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లినట్లు అందిన సమాచారంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అతణ్ని సస్పెండ్ చేశారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా స్ధానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ముందు జాగ్రత్తగా రౌడీ షీటర్లు కదలికలపై పోలీసు నిఘా పెట్టాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలకున్నారు.
త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపిడివో, ఎంపీవో, ఆర్ డబ్ల్యుఎస్ ఇంజినీర్లతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు చర్ల మండలం ఎర్రంపాడుకి చెందిన మడివి బుద్ర బుధవారం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారులు సమక్షంలో లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇతనిపై రూ. 4లక్షల రివార్డు ఉందని, మావోయిస్ట్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక లొంగిపోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
చర్ల మండలంలోని దోసిల్లపల్లి గ్రామ మూలమలుపు వద్ద బుధవారం అదుపుతప్పి వలస కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలు, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చర్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్
రాష్ట్రం చింతల్ నార్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
కారేపల్లి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది. 2, 3 రోజుల్లో సొసైటీ డైరెక్టర్లు ఖమ్మం డిసిఓని కలవడానికి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాగా మండలంలో సొసైటీ డైరెక్టర్లు మొత్తం 13 మంది ఉండగా, పదిమంది డైరెక్టర్లు చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో 327 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సింగరేణి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలన్నారు. (ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడబ్ల్యూడీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుందని సింగరేణి అధికారులు తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :04-05-2024 కాగా https://seclmines.com/scclnew/index.asp వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, ఖమ్మం రూరల్ పోలీసుల ఆద్వర్యంలో వివిధ ప్రాంతాలలోని సెంట్రల్ పోలీస్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. నగదు మద్యం రవాణాను చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జలగం వెంకటరావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తామని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందని.. అందుకే పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.