India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు సతమతమవుతున్నాయి . వారికి ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామ్ రెడ్డి పోటీలో ఉండడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

చేతిలో లగేజీతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన స్థానిక కవిరాజనగర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక 13వ వీధిలో ఓమహిళ రెండు చేతుల్లో బ్యాగులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని గొలుసు లాక్కుని పారిపోయాడు. ఘటనలో 3 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఎక్కుతుంది. ఒకే రోజు ఇద్దరు వివిధ పార్టీలకు చెందిన ఆగ్రనేతలు పర్యటనలతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మంలో రోడ్ షోకు KCR, కొత్తగూడెంలో BJP సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అటు కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి రఘురాం రెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. దీంతో జిల్లాలో పొలిటికల్ హీట్ తారస్థాయి చేరింది.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 18,500 జెండా పాట పలికింది. అలాగే, క్వింటాల్ పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో రైల్వే లైన్ పనుల నేపథ్యంలో నేటి నుంచి పలు రైళ్ల రాకపోకలను రైల్వే ఉన్న తాధికారులను రద్దు చేసినట్లు ఖమ్మం ఇన్చార్జి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. డివిజన్ పరిధిలోని చింతకాని, బోనకల్లు, పందిళ్లపల్లి, మధిరలో పాటు పలు రైల్వేస్టేషన్లలో మూడో రైల్వే లైన్ పనలు జరుగుతున్నాయని.. దీంతో పలు ఎక్స్ ప్రెస్ పలు ప్యాసింజర్ రైళ్లు నడపడం లేదని పేర్కొన్నారు.

ఖమ్మం లోక్‌సభ ఎన్నిక బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నెలకొంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో లేకపోవడంతో బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది.

డోర్నకల్- గద్వాల రైలు మార్గాన్ని సర్వే సంస్థ గగనతల పద్ధతుల్లో గుర్తించింది. సూర్యాపేట- ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎస్‌సీపీ-104 నుంచి ప్రారంభించి డోర్నకల్ సమీపంలోని దుబ్బబంజర ప్రాంతంలో 118 వరకు మార్కింగ్ చేపట్టింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల్లో సుమారు 1,300 నుంచి 1,400 ఎకరాల భూములు సేకరించనున్నట్లు సమాచారం.

ఈరోజు సాయంత్రం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్‌షో చేపట్టనున్నారు. జడ్పీ సెంటర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో రాత్రి బస చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఖమ్మం వస్తున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్‌ఎప్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.