India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును మరోసారి బరిలో దించింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్, తాతా మధు, రేగా కాంతారావు, తదితరులు ప్రచార బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. గతంలోనూ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటకపోయినా ఎంపీ ఎన్నికల్లో గెలిచామని ఈసారీ అలాగే జరగబోతుందని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

ఆయోధ్యలో రామాలయం కట్టి బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతోందని, తాము సైతం మరిపెడలో అతిపెద్ద రామాలయాన్ని నిర్మించామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తనను దొర అని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు, మరిపెడ, చేగొమ్మలో తన ఆస్తులను ప్రజల అవసరాల కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా నిలిచిపోతానని చెప్పారు.

లోక్ సభ ఎన్నికల్లో దేశాన్ని దోచుకున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీలను సమాధి చేయాలని కొత్తగూడెం ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన సీపీఐ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటుందన్నారు.

కరకగూడెం మండలం కలవల నాగారం సమీపంలో ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో మణుగూరు మండలం విజయనగరానికి చెందిన బిజ్జ రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కమ్యూనిస్టులతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కల్యాణం వెంకటేశ్వ రావులతో కలిసి సమావేశమయ్యారు. ఖమ్మం ఎంపీ స్థానం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు.

రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. కానీ సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాల రైతులు మాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ ఘట్టం ముగియడంతో పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించి గెలుపుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

∆} ఖమ్మంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
∆} పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేటకు చెందిన పవన్ అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్తుండగా అతని వాహనాన్ని తనిఖీ చేశారు. రూ.20,55,000 నగదు, 275 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఎంపికై పనులు ప్రారంభించిన పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం ఎన్నికల అధికారి, ఖమ్మం కలెక్టర్ వి.పి గౌతం ఆదేశించారు. లోకసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన శనివారం వ్యవసాయ కళాశాలలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూం, కమిషనింగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ స్థలాన్ని పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.