India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు తుక్కు తుక్కుకానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజారిటీ అందిద్దామని చెప్పారు. గతంలో BRS మాయమాటలు నమ్మి వివిధ పార్టీల నుంచి చేరి అక్కడ ఇమడలేక కాంగ్రెస్లో చేరిన వారందరికీ ఆహ్వానం పలికారు.

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆళ్లపల్లి మండలం మండలం అనంతోగులో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద చెకింగ్ చేశారు. ఎమ్మెల్యే వారికి సహకరించారు. ఎస్సై ఈ.రతీష్, హెడ్ కానిస్టేబుల్ వేములపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. కాగా తీన్మార్ మల్లన్న 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సూర్యాపేటకు చెందిన నరసింహా రెడ్డి, వరంగల్‌కు చెందిన రాకేశ్ రెడ్డి BRS తరఫున పోటీకి ఆసక్తి చూపతుండగా.. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఖమ్మం డిపోలో కొందరు ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ఎక్స్‌ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది. దీంతో మహిళలు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా జీరో టికెట్ తో ప్రయాణిస్తున్నారు. కానీ, ఖమ్మం డిపోకి చెందిన ఎక్స్ ప్రెస్ బస్సులు గ్రామాలలో ఆపడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఈనెల 30తో గడువు ముగియనున్న ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఖమ్మం కేఎంసీ అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. ఈ స్కీంకు అర్హత ఉన్నవారిని గుర్తించి వీటిని అందజేస్తున్నారు. అధిక మొత్తంలో పన్నులు చెల్లించే 1,974 మందికి నోటీసులు జారీ చేశారు. ఇక షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, హోటళ్లు, ఆస్పత్రులపై దృష్టి సారించి, వారిని ప్రత్యేకంగా కలిసి పన్నులు వసూలు చేస్తున్నారు.

ఏప్రిల్‌లో ఇచ్చిన ఎర్లీ బర్డ్ స్కీంను సద్వినియోగపరుస్తూ ఖమ్మం కేఎంసీ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ నెల 25 నాటికి 10,821 అసెస్మెంట్స్ నుంచి రూ.6.30 కోట్లు వసూలు చేశారు. వీటితో పాటు పంపు పన్నులు, ట్రేడ్ లైసెన్సుల ద్వారా పన్నులను వసూలు చేస్తున్నారు. ఎర్లీ బర్డ్ స్కీంకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉండడంతో మరో రూ.4 కోట్లకు పైగా వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం BRS పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని), అతని సోదరుడు కోనేరు పూర్ణచంద్రరావు, మాజీ జడ్పీ చైర్మన్ వాసుదేవరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు చిన్ని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో BRS పార్టీలో చేరారు.

భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇకపై శ్రీరామ నామము వినిపించేలా చర్యలు చేపట్టామని ఈఓ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ఆలయ సిబ్బందితో కలిసి శనివారం ప్రారంభించారు. ఆలయం తెరిచిన సమయం నుంచి ఆలయం మూసే వరకూ ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలలో శ్రీరామ నామం ప్రతిధ్వనించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ నాయకులతో కలిసి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలపై చర్చించుకున్నారు. పలు నియోజకవర్గాల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ఎస్.వీరయ్య పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా భద్రాద్రిలో 44 డిగ్రీలకు పైగా నమోదైంది. నేటి నుంచి మరో 10 రోజులపాటు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని అధికారులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.