India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కల్లూరు మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఖరారు అయినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో డిప్యూటీ CM సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరిలో ప్రసాద్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాగర్ రెండో జోన్ నుంచి సాగర్ జలాలు అందించేందుకు అధికారులతో రూపకల్పన చేయించారు. ఇందుకు రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల రెండు మండలాల్లోని 33,025 ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించనున్నారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,23,814 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 8,39,640 మంది, పురుష ఓటర్లు 7,84,043 మంది ఉండగా, మహిళా ఓటర్లు 55,597 మంది ఎక్కువ. ఇంకా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 222, సర్వీస్ ఓటర్లు 886 మంది ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 3,22,259 మంది, తక్కువగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,58,647 మంది ఓటర్లు ఉన్నారు.
పాలేరు జలాశయం వేసవి ప్రారంభంలోనే అడుగంటుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న ఈ జలాశయం.. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు తాగునీటి ఆదరువు. ఎండలు తీవ్రమైతే దీనిపై ఆధారపడిన ఈ జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లు కూడా మార్చి నెలలో పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితులున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట ఖానాపురం హవేలి పోలీసులను ఆదివారం ఆశ్రయించింది. నగరంలోని మామిళ్లగూడెం, శ్రీనగరాకాలనీ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. దీనికి యువతి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మేజర్లైన తాము ఇరువురం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరారు.
చెవి దుద్దులు కొనివ్వడం లేదని భర్తకు భార్య నిప్పంటించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట కాలనీలో నివసించే షేక్ యాకూబ్ పాషా, సమీనా దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. భార్య షమీనా భర్తను చెవి దిద్దులు కొనివ్వాలి అడగడంతో భర్త నిరాకరించారు. కోపంతో సమీనా భర్తకు నిప్పంటించింది. వెంటనే స్థానికులు పాషాను ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై ఉదయ్ కుమార్ కేసు నమోదు చేశారు.
∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} భద్రాచలం శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం
∆} ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం
పదోతరగతి వార్షిక పరీక్షలు నేడు మొదలుకానున్నాయి. ఉదయం9.30 నుంచి మధ్యాహ్నం12. 30 గంటల వరకు జరగనున్నాయి. 16,856 మంది హాజరుకానున్నారు. వీరి కోసం96 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 96 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 97 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1, 983 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షలను ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనునన్నాయి.
చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. కలెక్టర్, ఆదివారం పోలీసు కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి ఇల్లందు రోడ్, ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.