India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రఘునాథపాలెం మండలంలోని వీవీ పాలెం ఎస్టీ కాలనీ అంగన్వాడీ టీచర్ బానోత్ రంగాబాయి (46) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగాబాయి మంగళవారం గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఏడాది ఆశించిన స్థాయిలో నీటి సౌకర్యం లేక యాసంగిలో వరి సాగు గణనీయంగా తగ్గింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,62,391 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,05,333 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 57,058 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో సన్న రకాల సాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు.
మూడేళ్ల పాటు ప్రేమించుకున్నాక పెళ్లికి నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట యువతి మంగళవారం ధర్నాకు దిగింది. నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి రాము మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. అయితే కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవడానికి రాము నిరాకరిస్తున్నాడు. దీంతో అతని ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్భుతమైన ఫలితాలు ఇస్తూ వచ్చిన కార్యక్రమం ఒకటి హరితహారం. తాజాగా పదోవిడత హరితహారం అమలుకు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో 70.57 లక్షలు, భద్రాద్రి జిల్లాలో 65.73 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం ప్రతి గ్రామపంచాయతీ నర్సరీలో 10వేలు మొక్కలు పెంచాలని సూచించింది. జూన్, జూలై నెలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్‌లో బెట్టింగులు 100 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. దీంతో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని ఆట ఆడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. మొత్తం ఆన్లైన్ వేదికగా జరుగుతూ ఉండడంతో అధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఎక్కువగా యువత ఈ బెట్టింగుల్లో ఆడుతున్నారు.
పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాపురం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన కోక కార్తీక్(28) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు చేసుకున్నాడని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) రెండు, నాలుగో, ఆరో (రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ) ఏడాది అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి తెలిపారు.
రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) రెండు, నాలుగో, ఆరో (రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ) ఏడాది అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి తెలిపారు.
రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్న రామయ్య కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. నేటి నుంచి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారనే అంచనాతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని దేవస్థానం అధికారులు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
Sorry, no posts matched your criteria.