Khammam

News April 8, 2024

భద్రాచలం: శ్రీరామనవమి ప్రత్యేక రైళ్లేవి ?

image

శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో భక్తులు వచ్చే పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రామభక్తులు అసహన వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2024

మొదటి నుంచి పొంగులేటి అనుచరుడే..

image

భద్రాచలం MLA వెంకట్రావు పొంగులేటి అనుచరుడిగా గుర్తింపు పొందారు. 2014లో వైసీపీ తరఫున మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలం అసెంబ్లీ స్థానం బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. గతేడాది జులైలో కాంగ్రెస్‌లో చేరారు. టికెట్ కష్టమని భావించి మళ్లీ ఆగస్టులో సొంతగూటికి చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

News April 8, 2024

పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!

image

పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.

News April 7, 2024

చర్ల: 2 తలలు 6 కాళ్ళతో వింత దూడ జననం

image

చర్ల మండల పరిధిలోని జీపీ పల్లి గ్రామంలో ఆదివారం రెండు తలలు, ఆరు కాళ్ళతో లేగదూడ జన్మించింది. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన ఆవు ఆదివారం తెల్లవారుజామున ఈనింది. పుట్టిన లేగదూడ రెండు తలలు, ఆరు కాళ్ళతో ఉంది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు శ్రీనివాసరెడ్డి ఇంటికి తండోపతండాలుగా తరలి వచ్చి లేగ దూడను చూశారు. కాగా లేగదూడ పుట్టిన గంట తర్వాత మృతి చెందిందని బోరా శ్రీనివాసరెడ్డి తెలిపారు.

News April 7, 2024

మధిర: కరెంట్ షాక్‌తో సుతారి కూలీ మృతి

image

మధిర మండలంలో కరెంట్ షాక్‌తో సుతారి కూలీ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురంకు చెందిన కాకర్ల తిరుపతిరావు అనే వ్యక్తి మధిరలో ఓ అపార్ట్మెంట్ నిర్మాణంలో సుతారి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ఇసుకను ఎలక్ట్రానిక్ జల్లెడతో జల్లెడపోస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.

News April 7, 2024

ఖమ్మం: నెరవేరిన మంత్రి పొంగులేటి శపథం..!

image

BRS పై పొంగులేటి చేసిన శపథం నెరవేరింది. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క BRS ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు గెలుచుకునేలా కృషి చేశారు. అయితే ఒకే స్థానం BRS గెలిచింది. ఆ ఒక్క MLA తెల్లం వెంకట్రావును కూడా నేడు కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో BRSకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో పొంగులేటి శపథం నేరవేరిందని స్థనికంగా చర్చ జరుగుతుంది.

News April 7, 2024

భద్రాచలం ఎమ్మెల్యే పార్టీ మార్పుపై కేటీఆర్ స్పందన

image

భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు పార్టీ మార్పుపై కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టేకి వెళితే వెంటనే వారు అనర్హులయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ద్వంద నీతిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గెలవక ముందు ఒకలా గెలిచాక ఒకలా కాంగ్రెస్ పరిస్థితి ఉందని.. హస్తం పార్టీకి బీజేపీకి తేడా ఏంటని ప్రశ్నించారు.

News April 7, 2024

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలి: రేగా

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నామని, స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరడం పార్టీ వ్యతిరేక చర్య కిందికి వస్తుందన్నారు.

News April 7, 2024

రెండు నెలలు మరింత ఉష్ణోగ్రత… అప్రమత్తతే ముఖ్యం

image

ఖమ్మం జిల్లా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లో ఉంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు నెలల్లో ఉష్ణోగ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నందున అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు తమ పనులను కూడా వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవాలని చెబుతున్నారు.

News April 7, 2024

ఖమ్మం డిఫరెంట్.. మరి ఈసారి!

image

ఖమ్మం ఓటర్లు విలక్షణమైన తీర్పునిస్తుంటారు . 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా వైసీపీ నుంచి పొంగులేటిని గెలిపించారు. 2019లో బీఆర్ఎస్ నుంచి నామాను లోక్ సభకు పంపారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ ఈ రెండు సార్లు కాంగ్రెస్‌ను ఆదరించలేదు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పరిధిలో అన్ని ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. మరి అదే ఊపును ఎంపీ ఎన్నికల్లో కొనసాగిస్తుందా.. కామెంట్ చేయండి.