India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవిలో ఎండల తాకిడికి ప్రజలు అల్లాడుతున్నారు. అయితే నీడ పట్టున ఉండి పని చేసే వారికి సమస్య తీవ్రత తక్కువగా ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం భానుడి ప్రతాపాన్ని ఎదుర్కొంటూనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావాల్సిందే. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా కాపాడకోవాలని అధికారులు సూచిస్తున్నారు
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పంపిణీ చేసేందుకు గతేడాది 150 క్వింటాళ్ల తలంబ్రాలు తయారుచేయగా, ఈ ఏడాది 250 క్వింటాళ్లకు పెంచుతున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం తెలిపారు. పంపిణీకి 60 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 600 బస్సుల్లో 600 కేజీలు పంచనున్నట్లు చెప్పారు. ప్రసాదాలు పోస్టల్ ద్వారా విక్రయిస్తుండగా, తలంబ్రాలు పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మంలో ఈనెల 30వరకు 5 శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించే అవకాశం ఉందని మున్సిపాలిటీలోని మీసేవా కేంద్రం వద్ద కానీ, బిల్ కలెక్టర్‌కు లేదా CDMA.telangana.govt.in ద్వారా ఆన్లైన్ లో చెల్లించవచ్చని కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. షాపింగ్ మాల్స్ ఓనర్లు తప్పనిసరి ట్రేడ్ లైసెన్స్ పొందాలన్నారు. గడువు ముగిసిన వారు రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు.
గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం కాశీపట్నం వద్ద శనివారం జరిగింది. పిండిప్రోలుకి చెందిన ఐతనబోయిన వెంకటేశ్వర్లు(68) కాశీపట్నంలోని దేవాలయం వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రహదారిపై నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని, ములుగు ఎస్సీ కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ల పరంపర పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం అని భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నామన్నారు.
✓పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు పర్యటన
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో రుద్రాభిషేకం
✓కొత్తగూడెంణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓కరకగూడెం మండలంలో ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
నేలకొండపల్లి మండలం బైరవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని స్టోర్ గదికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. శనివారం మధ్యాహ్న భోజనం వండేందుకు వచ్చిన నిర్వాహకులు గది తలుపులు తీయగా ఈ విషయం బయటపడింది. దీంతో HM కోటేశ్వరరావు పరిశీలించగా.. సమీపాన మద్యం సీసాలు, సిగరెట్ పీకలు ఉండడంతో ఆకతాయిలు మద్యం తాగిన మైకంలో స్టోర్ గది కిటికీలో నుంచి నిప్పు వేసినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చర్ల సరిహద్దు చతిస్గడ్ కోసూరు పోలీస్ స్టేషన్ పరిధి నంబి అటవీ ప్రాంతంలో కర్రి గుట్టపై మావోయిస్టులకు భద్రతా దళాలకు శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్. జెడ్పీ సభ్యుడు సాగర్ అలియాస్ సంతోష్, మనీ రామ్ తోపాటు మరో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఒక LMG, ఒక AK 47, సహా 12 బోరు తుపాకులు అనేక ఆయుధాలు, నిత్యవసర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధ్రువీకరించారు.
దమ్మపేట మండలం మందలపల్లి రోడ్డు ప్రమాద బాధితుల వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ(35) చీపు లక్ష్మీ(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అశ్వారావుపేటలోని కోళ్ల ఫారంలో పని చేయడానికి వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందగా.. భర్త రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.
భద్రాద్రి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దమ్మపేట వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.