India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘ఆరుగాలం కష్టించి సాగు చేస్తున్న పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే నీవు క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తావా..!’ అంటూ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై స్థానిక కార్యాలయ ప్రాంగణంలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎండిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
ఖమ్మం జిల్లాలో మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు కమిషనరేట్ పరిధిలో షీ టీమ్లతో భరోసా కల్పిస్తామన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. మహిళలు ఎప్పుడైతే అభద్రతకు లోనవుతారో డయిల్ -100, షీటీమ్ నంబర్ 87126 59222కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా కొత్తవారి నియామకం జరగలేదు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
ఖమ్మం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శుక్రవారం వరకు 361మందిపై 287 కేసులు నమోదు చేయగా.. రూ.28,44,242 విలువైన సొత్తు
స్వాధీనం చేసుకున్నట్లు వ్యయ పరిశీలన అధికారి మురళీధర్ రావు తెలిపారు. రూ.50,400 విలువైన PDS బియ్యం
స్వాధీనం చేసుకున్నామని, పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి రూ.5,25,10,090 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కుటుంబ సభ్యులు మందలించారని ఓ బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కామేపల్లి మండలంలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్రాల గ్రామానికి చెందిన బాలుడు ఇటీవలే 10 తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే, ఏదైనా పని చేయాలంటూ కుటుంబీకులు సూచించడంతో మనస్తాపానికి గురైన బాలుడు శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 9 నుంచి 28 వరకు ఎక్కువమంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని సమకూర్చుకోవడానికి వివిధ ఖర్చుల నిమిత్తం షాపింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ఆదాయపు పన్ను శాఖ ఆంక్షలు ఉండడం, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్తే పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో.. వారు ఇబ్బందులు పడుతున్నారు.
> బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు నిరసన దీక్షలు
> ముదిగొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> జన జాతరకు తరలనున్న కాంగ్రెస్ శ్రేణులు
> ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బంద్
> తాగునీటి ఎద్దడి పై జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి సురేంద్రమోహన్ సమీక్ష
> భద్రాద్రి జిల్లా కలెక్టర్ లోక్ సభ ఎన్నికలపై సమీక్ష
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలు పూర్తికాగా.. మరో కొద్దిరోజుల్లో మిగతా విద్యార్థులకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంలో విహారయాత్రలకు, ఊర్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలియజేస్తున్నారు. విలువైన వస్తువులను లాకర్లలో, లేదా వెంట తీసుకెళ్లాలి.
పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.
మామిడి కాయలను తింటున్న కోతుల మందను కొట్టేందుకు చెట్టు ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పాల్వంచ మండలంలోని రంగాపురం వద్ద పెనుబల్లి మండలం రామసీతారాం గ్రామానికి చెందిన హనుమా మామిడి తోటను లీజుకు తీసుకున్నాడు. శుక్రవారం కోతులగుంపు చెట్ల మీదకు రావడంతో వాటిని తరిమేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.