India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమ విఫలమై జీవితంపై విరక్తి చెందిన ఓ డెలివరీ బాయ్ సూసైడ్ చేసుకొన్న ఘటన HYD కూకట్‌పల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన షేక్ షాజహాన్(30) భాగ్యనగర్‌కాలనీలో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అతడి ప్రేమను అమ్మాయి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉరివేసుకొన్నాడు.
జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. శిశు మరణాలపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలని, చిన్న పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని పీహెచ్సీకి తరలించాలని సూచించారు. డీఎంహెచ్ఓ జీవీఎల్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, డీఐఈఓ బాలాజీ, సర్వజన ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నర్సింహారావు తదితరులతో సమీక్ష నిర్వహించారు.
ములకలపల్లి మండలం చింతలపాడులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ పూరపై దాడి చేశారు. వివరాలిలా.. విధి నిర్వహణలో భాగంగా పూర ధర్మన్న సాగర్ శివారు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆదివాసీలు తమ పంటలకు అడవిలోని కుంట నీళ్లు వాడుతుండడంతో అధికారి మందలించారు. దీంతో ఆయన తలపై పారతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రాజమౌళి కేసు నమోదు చేశారు.
నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు పూజల సీతారాములును పొలం దగ్గర పాము కాటేసింది. సమీపంలోని రైతులు ఆయనను నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు.
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ములకలపల్లి మండలంలోని సాయిరాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి తాటి చెట్టు నుంచి పడి మృతి చెందాడు. బొగ్గం వెంకటేష్ (42) అనే వ్యక్తి ఉదయం కల్లు గీసేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కుతుండగా అదుపు తప్పి కింద పడ్డాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినా, తరగతులు ప్రారంభించినా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. అలాగే, పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 2024-25వ విద్యాసంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రకటన రాలేదన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో ప్లాస్టిక్ వినియోగం కూడా పెరుగుతోంది. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలతో ప్రమాదం పొంచి ఉన్నా.. ఆయా జిల్లాల పుర అధికారులు నియంత్రించడం లేదు. చట్ట ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదు. గత సంవత్సరం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ నిర్మూలనను గాలికి వదిలేశారు.
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాచలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ- విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడనుంది. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయా కలెక్టరేట్లు కేంద్రంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, ప్రాజెక్టుల్లో నీరు ఇంకిపోతుండగా బీళ్లను తలపిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం భూగర్భ నీటిమట్టం మరింత లోతుకు పోయింది. గతేడాది జిల్లాలో భూగర్భ నీటిమట్టం 9.47 మీటర్లు ఉండగా ఈ ఏడాది మార్చి వరకు 9.91 మీటర్ల లోతుకు వెళ్లిందని భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.