India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో వడదెబ్బ నుంచి రక్షణ సూచనలపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎండదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఉదయం 11గంటలు దాటితే బయటకు రావొద్దని కలెక్టర్ సూచించారు.

మాజీ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు శనివారం BRS నాయకులు పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఖమ్మం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన రూ. 2లక్షల రుణమాఫీ, రూ. 15 వేలు రైతు భరోసా, రూ. 4 వేలు పెన్షన్, వరికి రూ. 500 బోనస్ హామీలు అమలు చేయాలని గుర్తు చేశారు.

మే 6 నుంచి జరగబోయే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు కోసం ప్రతి సెమిస్టర్‌కి రూ. 250 అపరాధ రుసుముతో ఈ నెల 24 వరకు చెల్లించుకోవచ్చని యూనివర్సిటీ బోర్డు పేర్కొంది. ఈ చివరి అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఈనెల 25న కొత్తగూడెంలో నామినేషన్ వేస్తున్నామని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి షేక్ ఖలీల్ పాషా శనివారం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల సహకారంతో వైయస్సార్ సంక్షేమ పాలన అందించాలనే తపనతో పోటీ చేస్తున్నానని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెలిపించాలని కోరారు.

ఖమ్మం MP స్వతంత్ర అభ్యర్థిగా BRS జిల్లా విద్యార్థి విభాగం అద్యక్షుడు షేక్ బాజిబాబా నామినేషన్ దాఖలు చేసారు. జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ముస్లింలకు MP టికెట్ ఇవ్వాలని జిల్లా ముస్లిం మైనార్టీలు కేసీఆర్‌ను విన్నవించారని, కానీ వారి విజ్ఞప్తిని కేసీఆర్ తోసిపుచ్చారని అన్నారు. తమ గొంతును వినిపించేందుకు రెబల్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్ర గాయాలైన ఘటన పురుషోత్తపట్నం వద్ద చోటుచేసుకుంది. గమనించిన CRPF ఎస్సై యాకూబ్ పాషా అతనికి ప్రథమ చికిత్సను అందించి CRPF బెటాలియన్‌కు చెందిన అంబులెన్సులో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఖమ్మం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రబాబు అభిమానులు 74 కిలోల కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అభివృద్ధిపై అవగాహన ఉన్న నాయకుడు చంద్రబాబు అన్నారు. టీడీపీ నాయకులు వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరిచంద్ర ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

ఎలాంటి భయాందోళనకు గురికాకుండా మావోయిస్టులు ధైర్యంగా లొంగిపోతే సంరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎస్పీ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులైన నాగరాజు, సంజు ఎస్పీ ముందు లొంగిపోయారు. ఎస్పీ మాట్లాడుతూ.. లొంగిపోయిన CPI (మావోయిస్ట్) వారి పునరావాసం, సంక్షేమం కోసం ప్రభుత్వం ద్వారా అందించబడిన రివార్డ్ మొత్తాన్ని DDల రూపంలో మంజూరు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు రూ.16.25 కోట్ల చర, స్థిరాస్తులున్నాయి. పలు సంస్థల్లో పెట్టుబడులు, వినోద్‌రావు దంపతులకు కలిపి మొత్తం 6.8 కిలోల బంగారు, 61.3 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. కొత్తగూడెం, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో విలువైన వ్యవసాయ భూములు, మేడ్చల్‌లో వ్యవసాయేతర భూములు ఉన్నాయి. చరాస్తుల విలువ రూ.9.95 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.6.30 కోట్లు. రూ.3.42 లక్షల అప్పులున్నాయి.

ఎలాంటి భయాందోళనకు గురికాకుండా మావోయిస్టులు ధైర్యంగా లొంగిపోతే సంరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎస్పీ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులైన నాగరాజు, సంజు ఎస్పీ ముందు లొంగిపోయారు. ఎస్పీ మాట్లాడుతూ.. లొంగిపోయిన CPI (మావోయిస్ట్) వారి పునరావాసం, సంక్షేమం కోసం ప్రభుత్వం ద్వారా అందించబడిన రివార్డ్ మొత్తాన్ని DDల రూపంలో మంజూరు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.