India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు యత్నించిన ఘటన బోనకల్ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్‌కు చెందిన బండి రచన తన భర్త బండి సురేష్ ఇటీవల ట్రైన్ ప్రమాదంలో మరణించాడు. అయితే గత కొద్ది రోజులుగా అత్తమామలు, బావ కలిసి తనను వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది.

✓పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో డాక్టర్ ఎమ్మెల్యే రాగమయి పర్యటన
….

ఖమ్మం జిల్లాలో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. 4 నెలల్లోనే రూ.104 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.20 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఎండవేడితో గిరాకీ పెరుగుతున్నట్లు వైన్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదే అదనుగా వైన్స్ యజమానులు సిండికేట్‌గా మారి బీర్ల ఎమ్మార్పీ రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు నిఘా బృందాలు పటిష్ట కార్యాచరణ చేయాలని ఖమ్మం వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రశాంత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రా సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ నిఘా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఖమ్మం మున్నేరుపై బ్రిడ్జ్, కాంక్రీట్ వాల్ నిర్మాణ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈసందర్భంగా వారికి సలహాలు సూచనలు చేసారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి పురాతన బ్రిడ్జ్ ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా చూసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచించారు.

ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు తరపున ఎన్నికల ప్రచారం కోసం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెలికాప్టర్లో వచ్చారు. దీంతో ఎన్నికల సిబ్బంది, ఫ్లయింగ్ స్కాడ్ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, శిక్షణ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠలు తనిఖీ చేశారు. 10నిమిషాల పాటు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.

ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో నిర్వహించిన రోడ్‌షోలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో ఉందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.

వరంగల్ మిరపకాయ్ సంగతీ మీకు తెలుసు కేసీఆర్.. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ రేవంత్ రెడ్డి పెడతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబుబాబాద్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో బలరాం నాయక్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్‌కు చిప్పకూడు తినే రోజులు తోందరలోనే వస్తాయన్నారు.

ఎంపీ ఎన్నికల్లో నామా గెలుపు ఖమ్మం జిల్లాలో చరిత్రాత్మకం అవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేసీఆర్ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పువ్వాడ అన్నారు. పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేసి నామా గెలుపునకు సహకరించాలని ఆయన కోరారు. గతం కంటే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసేవారికి ఎప్పటికైనా అవకాశాలు వస్తాయన్నారు.

ఖమ్మంలో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేగంగా వెళుతున్న లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.