Khammam

News March 29, 2024

కొత్తగూడెం: చోరీ చేస్తుండగా పట్టుకొని దేహశుద్ధి

image

బూర్గంపహడ్ మండల కేంద్రంలోని క్లస్టర్ మిల్లు సమీపంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామ చివర ఉన్న క్లస్టర్ మిల్లు వద్ద నలుగురు దొంగలు ట్రాలీ వాహనంలోకి దొంగతనంగా హెవీ జనరేటర్ ఎక్కిస్తున్న క్రమంలో స్థానిక రైతులు ఇద్దరు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గతంలో చోరీకి గురైన మోటర్లు, పలు పరికరాలు వీళ్లే ఎత్తుకెళ్లినట్లు రైతులు భావిస్తున్నారు.

News March 29, 2024

ఖమ్మంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

image

ఖమ్మం ఖానాపురం పరిధిలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం తొలగించారు. సర్వేనెంబర్ 37లో సుమారు 35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 2004, 2009 సంవత్సరాల్లో 300 మంది మాజీ సైనికులకు, 139మంది స్వాతంత్య్ర సమరయోధులకు మొత్తం 439మందికి 144 గజాల వంతున అప్పటి కలెక్టర్లు అందజేసి, వారికి అసైన్డ్ పట్టాలు ఇచ్చారు.

News March 29, 2024

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ

image

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో చేతులు కలిపిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం ఒక లేఖలో పేర్కొన్నారు. దుమ్ముగూడెంలో అరెస్టు చేసి మాయం చేసిన ఛత్తీస్‌గఢ్ ఆదివాసి యువకులను ఏం చేశారో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. విప్లవ ప్రతిఘాతుక కగార్ (అంతిమ దశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయన్నారు.

News March 29, 2024

KTDM: ‘నేను పార్టీ మారడం లేదు’

image

మహబూబాబాద్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారడం లేదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా. నాపై నమ్మకంతోనే మళ్లీ మహబూబాబాద్ ఎంపీ సీటు కేసీఆర్ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలిచే ఎంపీ స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి’ అని చెప్పారు.

News March 29, 2024

మార్చిలోనే మండుతున్న ఖమ్మం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం మధిర, బోనకల్, ఎర్రుపాలెం, సత్తుపల్లిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఖమ్మం, కొణిజర్ల, భద్రాచలం, చర్ల, బూర్గంపాడులో 39, పెనుబల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి మధ్యాహ్నం రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News March 29, 2024

ఖమ్మం: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

image

ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఖమ్మం లోకసభ ఎన్నికల కౌంటింగ్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏడు సెగ్మెంట్లకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూంలు, కేంద్రీకృత రిసెప్సన్ కేంద్రం ఏర్పాటుపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.

News March 29, 2024

ఖమ్మం: కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి

image

కొబ్బరి చెట్టుపై నుంచి ఓ యువకుడి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన వేంసూరు మండలం అమ్మపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు (34)కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2024

ప్చ్.. ఖమ్మంలో కాంగ్రెస్‌లో గెలవలేదు

image

ఖమ్మం MP స్థానాన్ని 2014లో YSRCP గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పొంగులేటి గెలిచారు. 2019లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) నుంచి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు హస్తం పార్టీకి నిరాశే ఎదురైంది. ఈసారి ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఖమ్మం MP సెగ్మెంట్ తమదే అని కాంగ్రెస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.

News March 29, 2024

ఖమ్మం విషయంలో ఎందుకింత లేటు..

image

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉండగా, బీజేపీ తాండ్ర వినోద్ రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడంలో ఇంకా మల్లగులాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలోనూ ఈ విషయంపై స్పష్టత రాలేదు. కంచుకోటలోనూ టికెట్ కేటాయింపులో జాప్యం ఏంటని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

News March 29, 2024

ఖమ్మం: రైల్వే లైన్.. రైతుల్లో ఆందోళన 

image

ఖమ్మం జిల్లా మీదుగా డోర్నకల్‌-మిర్యాలగూడ, డోర్నకల్‌-గద్వాల లైన్ల నిర్మా ణం జరగనుందనే ప్రచారం జరుగుతోంది. లైన్ల ప్రతిపాదనలపై ఏ శాఖ అధికారులూ స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం ఖమ్మం రూరల్‌ మండలం ఆరెకోడు గుట్ట, తిరుమలాయపాలెం రైతు వేదిక, పాపాయిగూడెం సమీపాన మార్కింగ్‌ ఇచ్చారు. దీంతో రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.