Khammam

News March 29, 2024

డిగ్రీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఖమ్మంలో గర్ల్స్ డిగ్రీ కాలేజీ, కొత్తగూడెంలో బాయ్స్ డిగ్రీ కాలేజీ ఉండగా, ఆర్‌డీసీ సెట్‌–2024 ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఖమ్మం కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.వీ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్‌ 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> మధిరలో ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పర్యటన
> వేంసూరు మండలం లక్ష్మీనారాయణపురంలో ఆంజనేయస్వామి ఆలయంలో వార్షికోత్సవ ఉత్సవాలు
> ఖమ్మం జిల్లాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాక
> తాగునీటి ఎద్దడిపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
> కొత్తగూడెంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం
> చింతూరులో టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం
> మణుగూరులో సీఐటీయూ సంతకాల సేకరణ

News March 29, 2024

ఖమ్మం: రోజూ రూ.1.50 కోట్లకు పైనే..

image

ఖమ్మం హెడ్‌ పోస్టాఫీస్‌లో నిత్యం రూ.1.50 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. పొదుపు పథకాలు, డిపాజిట్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, తపాలా జీవిత బీమా, మనియార్డర్లు , స్పీడ్‌ పోస్టులు, పార్సిళ్ల సేవలతో పాటు పాస్‌పోర్టు సేవలు, ఆధార్‌ సేవలు, స్టాంపుల విక్రయాలు వంటి వాటి ద్వారా ఈ లావాదేవీలు నమోదవుతున్నాయి. వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

News March 29, 2024

ఎలక్షన్ వేళ ఉమ్మడి జిల్లాపై డేగ కన్ను

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్ సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.

News March 28, 2024

రెండో ప్రధాన పంటగా పత్తి: తుమ్మల

image

వచ్చే ఖరీఫ్ సీజన్ పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష నిర్వహించారు. వర్షాకాలానికి సంబంధించి సాగు వివరాలు, విత్తన లభ్యతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 28, 2024

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ రవాణా కట్టడి చేయాలి: సీపీ

image

అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసుల సమిష్టి కృషి, సమాచార మార్పిడితో ఫ్రీ & ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలని సీపీ సునీల్ దత్, ఏలూరు ఎస్పీ మేరి ప్రశాంతి అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలో అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం, ఏలూరు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు.

News March 28, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనకు ఆలస్యం ఏంటి..?

image

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ భావించిన అది జరగలేదు. అభ్యర్థి ప్రకటనపై ఎందుకు ఆలస్యం జరుగుతుందో అర్థం కాకుండా ఉందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో వారు నిమగ్నమయ్యారని, త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు.

News March 28, 2024

పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా సహాయకుడు అరెస్ట్

image

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాజేసిన కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయకుడిగా పనిచేస్తున్న వంశీ ను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవడానికి రాని వారి పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులతో మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

News March 28, 2024

ప్రజలకు సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నా: తాండ్ర

image

ఈ గడ్డ బిడ్డగా తాను 30 ఏళ్ల పాటు వ్యాపార, సాంకేతిక, సేవా రంగాల్లో గడించిన అనుభవంతో సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. గురువారం కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కొత్తగూడెం ప్రజలకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ చేస్తానన్నారు.

News March 28, 2024

మధిర: ట్రాక్టర్ రోటవేటర్‌లో చెత్త తొలగిస్తుండగా రైతు మృతి

image

మధిర మండలం నిదానపురానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలంలో మిర్చి పంటను సాగు చేశాడు. మిర్చి పంట పూర్తి కాగా వ్యర్థాలను తొలగించడానికి రైతు ట్రాక్టర్ రోటవేటర్‌తో దున్నుతున్నాడు. రోటవేటర్‌లో చెత్త ఇరుక్కుపోయి ఆగిపోవడంతో చెత్తను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో పడిపోయాడు. తల నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.