Khammam

News March 25, 2024

ఈనెల 27 పర్ణశాల,28 భద్రాచలంలో హుండీల లెక్కింపు

image

దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో ఈనెల 27న, భద్రాచలం దేవస్థానంలో ఈనెల 28న హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుండి హుండీ, లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు, ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, పోలీస్ శాఖ అధికారులు గమనించాలని తెలియజేశారు.

News March 25, 2024

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 25, 2024

అడుగంటిన పాలేరు రిజర్వాయర్

image

పాలేరు రిజర్వాయర్లో ప్రస్తుతం 7.45అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రతిరోజు మూడు జిల్లాలకు కలిపి 15 టీఎంసీల నీటిని నాలుగు స్కీముల ద్వారా మిషన్ భగీరథకు వినియోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను పాలేరు రిజర్వాయర్ అధికారులు కోరారు. ఈ నెలాఖరులోగా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వచ్చే అవకాశం ఉంది.

News March 25, 2024

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భేటీ

image

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాసేవలో నిమగ్నమైన వినోద్ రావు ఖమ్మం బరిలో ఘన విజయం సాధిస్తారని విద్యాసాగర్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. వినోద్ రావు విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఈ సారి ఖమ్మం స్థానం బీజేపీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

News March 25, 2024

చింతకాని : అది పెద్ద పులి కాదు నక్క..!

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో గాలిబ్ సాహెబ్ అనే రైతు మొక్కజొన్న పొలంలో పంటకు నీళ్లు పెడుతుండగా పెద్దపులి కానబడిందని అక్కడి నుంచి పరుగు పెట్టి గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు పోలీసులకు, అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన అటవీశాఖ అధికారులు పెద్దపులి కాదు అని హైనా జాతికి చెందిన నక్కగా గుర్తించారు.

News March 25, 2024

కిషన్ రెడ్డితో ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భేటీ

image

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సోమవారం హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందనీ, ఖమ్మంలో వినోద్ రావును భారీ మోజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు విస్తృత సేవ చేసేలా తనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వినోద్ రావు కృతఙ్ఞతలు తెలిపారు.

News March 25, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై తెరపడని ఉత్కంఠ!

image

కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. రోజుకో పేరును తెరపైకి వస్తుండడం.. అధిష్ఠానం ఎవరి పేరునూ ఖరారు చేయకపోవడంతో నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అభ్యర్థి ఎంపిక ప్రహసనంగా మారడంతో పార్టీలో చర్చకు దారి తీసింది. సీటు కోసం ఎవరికివారు అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

News March 25, 2024

భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలు ప్రారంభం

image

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పౌర్ణమి సందర్భంగా డోలోత్సవం, వసంతోత్సవo వైభవంగా నిర్వహించారు. స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించిన రోజు భద్రాద్రి రామయ్యను పెళ్లికుమారుడిని చేసినట్లు విశ్వసిస్తారు. అలాగే మిథిలా స్టేడియంలో రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు కలిపారు. ఈ వేడుకకు అశేష భక్త జనం హాజరయ్యారు.

News March 25, 2024

గోదావరిలో మునిగిపోతున్న యువకులను కాపాడిన పోలీసులు

image

మణుగూరు కొండాయిగూడెం గోదావరి తీర ప్రాంతంలో హోలీ పండుగ నేపథ్యంలో స్నానానికి వెళ్లి మునిగిపోతున్న ముగ్గురు యువకులను స్థానిక పోలీసులు రక్షించారు. ఈ ముగ్గురు యువకులు సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన వారు. గోదావరి నీటి ప్రమాదం నుండి ముగ్గురు యువకులను కాపాడిన TSSP కానిస్టేబుల్ వినయ్, సనై కానిస్టేబుల్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 25, 2024

KMM: వేసవి వినోదం జాగ్రత్త మరి

image

ఎండలకు తాళలేక విద్యార్థులు వేసవిలో బావుల్లో, చెరువుల్లో, ఈతకు వెళ్తుంటారు. ఈత నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగుతూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. పెద్దల పర్యవేక్షణలోని పిల్లలు ఈతకు వెళ్లడం సురక్షితమని అధికారులు చెబుతున్నారు. ఆదివారం పాల్వంచ మండలంలో 10వ తరగతి విద్యార్థి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.