India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపటి నుంచి ఐదు రోజులు సెలవు ఉన్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రావ్ జయంతి, శనివారం వారంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది పర్వదినం ఉన్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి బుధవారం పదో తారీఖున మార్కెట్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింటా రూ.20,000 ధర పలకగా పత్తి జెండా పాట క్వింటా రూ.7300 పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర నిన్నటి కంటే 100 రూపాయలు తగ్గగా మిర్చి ధర 1,300 పెరిగింది.

కల్లూరులో తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. వాణిజ్యశాఖ అధికారి ఏసీటీవో -1 శ్రీరామ్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది కలిసి వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద అనధికారికంగా రూ.10వేల నగదు ఉందని, ప్రస్తుతం ఎంక్వయిరీ చేస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బోనకల్‌కి చెందిన బండి సురేష్ అనే యువకుడు బుధవారం రాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ అతణ్ని ఢీకొట్టింది. దీంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్ మృతితో బోనకల్‌లో విషాదం అలుముకుంది.

వాహనదారులకు అందించే ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల్లో టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, టీజీ పేరుతో ప్రింట్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు బుధవారం జిల్లా రవాణా శాఖ కేంద్రానికి చేరుకున్నాయి. అయితే 1,500 కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా 500 కార్డులు మాత్రమే వచ్చాయి. జిల్లాకు సరిపడా కార్డులు త్వరలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఇంటి వద్ద పనిచేసుకుంటున్న ఓ మహిళ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నేలకొండపల్లిలో బుధవారం జరిగింది. సుజాత(57) బుధవారం ఇంటి వద్ద పనిచేసుకుంటోంది . ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సత్తుపల్లి అమ్మాయి స్పెయిన్ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాలిలా.. సత్తుపల్లికి చెందిన లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ బార్సిలోనాలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ ఉద్యోగి అయిన స్పెయిన్‌కి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి బుధవారం పెళ్లి చేసుకున్నారు.

ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో 20వేల భద్రాద్రి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యంగా ఆర్టీసీ కార్గో అధికారులు కసరత్తు చేపట్టారు. రీజియన్‌లో గత ఏడాది 5,757 ప్యాకెట్లు బుక్ చేయగా.. రూ.6.67 లక్షలు ఆదాయం సంస్థకు లభించింది. ఈ ఏడాది అంతకు నాలుగు రెట్ల లక్ష్యాన్ని అధికంగా నిర్ణయించుకున్న అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు.

✓ పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
✓అశ్వరావుపేటలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓దుమ్ముగూడెం మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
✓సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటన

టెన్త్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైంది. కాగా డ్యూటీ ఆర్డర్లు తీసుకున్న వారిలో తొలిరోజు సమాచారం ఇవ్వకుండానే 185 మందికి పైగా విధులకు గైర్హాజరయ్యారు. డీఈవో సోమశేఖర శర్మ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.