Khammam

News August 9, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి, పత్తి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,225 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి ధర రూ.25 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News August 9, 2024

రేషన్ కార్డుల జారీ కోసం సబ్ కమిటీ.. పొంగులేటికి చోటు

image

రేషన్ కార్డులు జారీపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్ కాగా దామోదర్ రాజానర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను ఈ కమిటీ సిఫార్స్ చేయనుంది.

News August 9, 2024

విస్తారంగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్ళలో ఆనందం

image

ఈ ఏడాది వానాకాలం ఆరంభం నుంచే విస్తారంగా వానలు కురుస్తున్నాయి. జూన్ సాధారణ వర్షపాతం 124.6 మి.మీలు కాగా 198.8 మి.మీ.గా(60శాతం ఎక్కువ) నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 249.6 మి.మీ.కు గాను 303.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అంటే 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నారు.ఇక గురువారం వరకు సాధారణ వర్షపాతం 56.8 మి.మీ.లు కాగా 128.7 మి.మీ.గా నమోదు కావడంతో రైతుల్లో హర్షం చేశారు.

News August 9, 2024

విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతాం: డిప్యూటీ సీఎం

image

విద్యుత్ శాఖ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామని ప్రకటించారు. విద్యుత్ శాఖలో 7-8 ఏళ్లుగా ప్రమోషన్లు లేవని దీని వల్ల చాలా మంది ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.

News August 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

∆}భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
∆}మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్
∆}ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం: మంత్రి తుమ్మల
∆}అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
∆}లొంగిపోయిన మావోయిస్టు పార్టీ ఏరియా సభ్యులు
∆}డంపింగ్ యార్డ్ ను సందర్శించిన CDMA, జిల్లా కలెక్టర్
∆}₹70 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే రాందాస్

News August 8, 2024

KMM:బోడ కాకరకాయకు పెరిగిన డిమాండ్

image

ఖమ్మం జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ బోడ కాకరకాయలకు యమ డిమాండ్ ఉంటుంది. పొట్టిగా చిన్న చిన్న ముళ్లతో ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. అడవిలో పెరిగే ఈ తీగలు వర్షాకాలం ముగియడంతో ఎండిపోతాయి. స్థానిక గిరిజనులు ఉదయాన్నే అడవికి వెళ్లి తీసుకొచ్చి ఉపాధి పొందుతూ ఉంటారు. ప్రస్తుతం దీనిని కేజీ రూ. 300 వరకూ అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు.

News August 8, 2024

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

image

ఈనెల 15న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ సిపి సునీల్ దత్ తో కలిసి పరిశీలించారు. సీఎం సభ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News August 8, 2024

సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఆగస్టు 15 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న రైతంగ సదస్సు సభ స్థలాన్ని కలెక్టర్ ముజామ్మిల్ పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గతంలో అనుకున్న స్థలంలో ఇబ్బందులు దృష్ట్యా మరొక స్థలాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

News August 8, 2024

కొత్తగూడెం: జడివానలో జడ్డీపై నిండు గర్భిణి

image

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా కొత్తగూడెం జిల్లాలో రోడ్ల దుస్థితి మాత్రం దారుణంగానే ఉంది. గర్భిణీలను ఇంకా జడ్డీపైనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని జడ్డీలో దవాఖానకు తరలించిన ఘటన భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో జరిగింది. 3 కిలోమీటర్లు ఆమెను జడ్డీపై మోస్తూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

News August 8, 2024

మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణించే వాహనానికి వైరాకు సమీపంలో పంక్చర్ అయింది. హైలెవెల్ వంతెన దిగిన తర్వాత జాతీయ ప్రధాన రహదారిపై పొంగులేటి ప్రయాణిస్తున్న వాహనం వెనుక భాగంలోని ఎడమ టైరు పంక్చర్ కాగా అప్రమత్తమై కారును వెంటనే నిలిపివేశాడు. దీంతో పొంగులేటి కాన్వాయ్ రహదారిపై కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం వేరే వాహనంలో పొంగులేటి వెళ్లిపోయారు.