Khammam

News August 8, 2024

ఖమ్మం: ఈనెల 9న ఎప్‌‌సెట్ చివరి విడత కౌన్సెలింగ్

image

ఖమ్మం జిల్లాలో తొలి రెండు విడతల ఎప్‌‌సెట్ కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు ఈనెల9న నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు రావాలని ఎస్ఆర్‌బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జకీరుల్లా బుధవారం తెలిపారు. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, 13న సీట్లు కేటాయింపు, 15, 16, 17 తేదీల్లో కళాశాలల్లో చేరే ప్రక్రియ ఉంటుందన్నారు.

News August 8, 2024

ఖమ్మం: కుక్కకు సీమంతం చేసిన మహిళ

image

పెంపుడు శునకానికి సీమంతం చేసిన ఘటన మధిరలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. పట్టణానికి చెందిన ఈశ్వరరాణి ఏడాదిగా కుక్కను పెంచుతున్నారు. అది మూడు నెలల క్రితం గర్భం దాల్చింది. బుధవారం పట్టు బట్టలతో ముస్తాబు చేసి ఇరుగు పొరుగు, బంధువులను పిలిచి సీమంతం చేశారు. కూతురితో సమానమనుకోని సీమంతం చేస్తున్నామని ఈశ్వరరాణి చెప్పారు.

News August 8, 2024

కల్లూరు ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ ఎత్తివేత: డీఈఓ

image

కల్లూరు మండలంలో విద్యార్థులకు క్షవరం చేయించిన ఘటనలో సస్పెన్షన్‌కు గురైన పేరువంచ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు డి.శిరీషపై సస్పెన్షన్ ఎత్తి వేశారు. చెన్నూరు ఉన్నత పాఠశాలలో ఆమెను విధులు నిర్వహించాల్సిందిగా డీఈవో సోమశేఖరశర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

News August 8, 2024

అన్ని గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలి: జిల్లా కలెక్టర్

image

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రెండు రోజులు జిల్లా అధికారులందరూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని కలెక్టర్ అన్నారు. రెండు రోజులు కూడా పూర్తి శ్రద్ధతో కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇవాళ జిల్లాలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఫీవర్ సర్వే చేపట్టాలని పేర్కొన్నారు.

News August 7, 2024

భారీ వర్షాలకు మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోందని అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటలకు నీటిమట్టం 36.70 అడుగులు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

News August 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

*భద్రాద్రి రామాలయాన్ని చుట్టుముట్టిన వరద నీరు
*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం: డిప్యూటీ సీఎం భట్టి
*ముదిగొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి సూసైడ్
*కేటీపీఎస్ రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలి
*పదవి లేకపోయినా ప్రజాసేవ కొనసాగించాలి: ఎమ్మెల్యే పాయం
*రెండు పంటలకు నీరు అందిస్తాం: మంత్రి పొంగులేటి
*జడ్పీ అధికారిగా భాద్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్

News August 7, 2024

ఆగస్ట్ 15న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం: మంత్రి ఉత్తమ్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న దీన్ని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనంతరం వైరాలో జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు. ఆగస్టు 15 తేదీని రైతు దినోత్సవంగా జరుపుకోబోతున్నామని తెలిపారు.

News August 7, 2024

సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

image

ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి వైరాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం 14వ వార్డు నందు డాంబర్ వెంచర్ స్థలాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదుల హరినాథ్, కట్ల సంతోష్, పమ్మీ అశోక్, పల్లపు కొండలు, ఆత్మ కమిటీ ఛైర్మన్ కోసూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

News August 7, 2024

డ్రైనేజీ కాలువలో గల్లంతైన మృతదేహం లభ్యం

image

భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో సతీష్(42) అనే వ్యక్తి డ్రైనేజీ కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు డ్రైనేజీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టి, గల్లంతైన మృతదేహాన్ని వెలికి తీశారు. వెలికితీసిన మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News August 7, 2024

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం: భట్టి

image

ఈ ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.5 లక్షల వ్యయంతో రెండు గదుల ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు మరో లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు ఇస్తామని వివరించారు.