Khammam

News July 7, 2024

రైతు భరోసా స్కీమ్‌కు సవాల్‌గా కౌలు రైతులు

image

రైతు భరోసా స్కీమ్ను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దీంతో కౌలు రైతులను గుర్తించడం సమస్యగా మారింది. ఈ క్రమంలో కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ అంశంపై జోరు చర్చలు జరుగుతున్నాయి.

News July 7, 2024

భార్య మరణించిన పదిహేను రోజులకే భర్త మృతి

image

భార్య మరణించిన పదిహేను రోజులకే భర్త మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం జగ్యాతండాలో శనివారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. తేజావత్ సంగ్యా(60), కౌసల్య దంపతులు. తీవ్ర అనారోగ్యానికి గురైన కౌసల్య చికిత్స పొందుతూ జూన్ 22న మృతి చెందింది. ఆమెను తలుచుకుంటూ నిత్యం మనోవేదనకు గురైన తేజావత్ సంగ్యా శనివారం మృతి చెందాడు.

News July 7, 2024

కమనీయంగా భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

image

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యా వాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ , అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని జరిపారు.

News July 7, 2024

ఖమ్మం: SI మరణ వార్త విని మేనత్త గుండెపోటుతో మృతి

image

సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని ఆమె మేనత్త రాజమ్మ కుప్ప కూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు ఒకే రోజున మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News July 7, 2024

నిధుల్లేక గ్రామ పంచాయతీల పరేషాన్!

image

ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఐతే పారిశుద్ధ్యం నిర్వహణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు నేడు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారాయి. డబ్బులు లేక ట్రాక్టర్లు కార్యాలయంలోనే ఉంచుతున్నారు. బయటకు తీస్తే డిజీల్ కు డబ్బులు కావాలి. పెట్టుబడులు పెట్టే వారు లేరు. ఇప్పటికే అందినకాడికల్లా అప్పులు తెచ్చి పెట్టిన పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం చేతులేత్తేశారు.

News July 7, 2024

ఖమ్మం: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

image

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవా పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

News July 7, 2024

కొత్తగూడెం: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బట్టీల గుంపు గ్రామ పంచాయతీలోని పాయం జానకిరామ్ గుంపునకు చెందిన కోరం కృష్ణవేణి (23) అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. పొలంలో పనికి రాకపోవడంతో తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News July 7, 2024

సింగరేణి కొలువులకు రాతపరీక్షలు

image

సింగరేణి సంస్థ మొత్తం 10 కేటగిరీల్లో 272 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువరించింది. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు యాజమాన్యం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. హాజరయ్యే అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది.

News July 7, 2024

ఖమ్మం: తల్లీకూతురిని కరిచిన పాము

image

తల్లీకూతురును పాము కరిచిన ఘటన నేలకొండపల్లి మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సుర్దేపల్లికి చెందిన రాధ(27), ఆమె కూతురు దీవెన (5) శుక్రవారం రాత్రి వరండాలో నేలపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో కట్ల పాము తొలుత కూతురు దీవెనను, తర్వాత రాధను కరించింది. చుట్టుపక్కల వారు వచ్చి పామును చంపారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు.

News July 7, 2024

ఉమ్మడి జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు

image

ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటివరకు పత్తి పంట ఒక్కటే అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలోనే పత్తి పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. జూన్ మాసాంతానికి ఖమ్మం జిల్లాలో 1,81,723 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 1,88,263 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈపంట సాగైందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.