India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డా.బీ.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల అధికారులతో సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ప్రీ బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా బడ్జెట్ రూపొందించాలని చర్చించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎన్కూర్, జూలూరుపాడు, సుజాతనగర్, దమ్మపేట, టేకులపల్లి, కూసుమంచి, కారేపల్లి మండల కేంద్రాలలో TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్గో ATM రామారావు తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలను నడిపేందుకు కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ మిషన్ కలిగి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 సంప్రదించాలన్నారు.

విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, TTDCలో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ అంశాలపై నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించే సమయంలో మనం చేయాల్సిన ప్రతిపనికి కచ్చితమైన రూల్ పొజిషన్ ఫాలో అవ్వాలని సూచించారు.

√కారేపల్లి: ప్రజావాణి కార్యక్రమంలో భారీగా దరఖాస్తులు √ఖమ్మం: పారదర్శకంగా సేవలు అందించాలి: కలెక్టర్ √ఖమ్మం: TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు దరఖాస్తులు √వేంసూర్ పామాయిల్ ఫ్యాక్టరీకి రూ.240కోట్లు: ఎమ్మెల్యే √ఖమ్మం: హోలీ వేడుకల ప్రచారాన్ని ఖండిస్తున్నాం: ప్రిన్సిపల్ √సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు √ఖమ్మం: వ్యవసాయ రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి: మంత్రి తుమ్మల

377 నిబంధన కింద తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీరఘురాం రెడ్డి సోమవారం లోక్‌సభలో కోరారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తృతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందన్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చడం, జాతీయ ఆహార చమురు సరఫరాలో గణనీయంగా దోహదపడతామన్నారు.

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 36 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ కలిగే అవకాశం ఉందని, మ.12 నుంచి మ.3:30 వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని తెలిపారు. మధ్యాహ్నం వరకే 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. బయటికి వెళ్లేవారు నీరు, గొడుగును తీసుకువెళ్లాలని, సాయంత్రం, ఉదయం వేళల్లో బయటికి వెళ్లాలని సూచించారు.

ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రవిచంద్ర రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు.. కొత్త ప్లాట్ ఫామ్‌లను విస్తరించడం, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్‌లు వంటి అంశాలపై వివరించారు.

వైరా, నేలకొండపల్లి మండలాల్లో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి వైరా (M) పుణ్యాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం నేలకొండపల్లి (M) మేడేపల్లి, అనసాగరం, సదాశివాపురం, నాచేపల్లి, చెర్వుమాదారం, అమ్మగూడెం, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు.

సత్తుపల్లి మండలంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి శివారులోని తామర చెరువు వద్ద కాకర్లపల్లి నుంచి వెళుతున్న కూలీల ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.