Khammam

News March 10, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News March 10, 2025

ఖమ్మం: కాల్వలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

మున్నేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లికి చెందని మహేశ్ ఖమ్మంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదైంది.

News March 10, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

✓ సింగరేణి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ✓ఖమ్మం: సేంద్రీయ సాగుపై మంత్రి తుమ్మల సంతృప్తి ✓ వనంవారి కిష్టాపురం వద్ద కారు బోల్తా.. స్వల్ప గాయాలు ✓ కూసుమంచి: సోదరుల మధ్య ఘర్షణ.. అన్న తలకు గాయం ✓ మన ఖమ్మం జిల్లాకు రూ.1,400 కోట్లు ✓ చింతకాని : యువతి అదృశ్యం.. కేసు నమోదు ✓ చింతకాని: లింగనిర్ధారణ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.

News March 9, 2025

ఖమ్మం: శ్రీ చైతన్య క్యాంపస్‌లో అవగాహన సదస్సు

image

పుట్టకోటలోని శ్రీ చైతన్య గ్లోబల్ క్యాంపస్ నందు ‘ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ -బియాండ్ బౌండరీస్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్రాంత సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ హాజరై AI, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల గురించి వివరించారు. సదస్సులో 2 వేలకు పైగా ప్రముఖులు, తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ మల్లంపాటి శ్రీధర్, ఏజీఎంలు, కోఆర్డినేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

News March 9, 2025

ఖమ్మం: విద్యార్థినికి మెసేజ్‌లు.. లెక్చరర్‌పై పోక్సో కేసు

image

ఖమ్మం గాంధీ చౌక్ వద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినికి ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్న లెక్చరర్ కె.హరిశంకర్‌పై ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 3టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆయనను IEJD విధుల నుంచి తొలగించారు.

News March 9, 2025

ఎమ్మెల్సీ రేసులో విజయబాయి!

image

వైరాకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు విజయబాయి MLC రేసులో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించగా రాందాస్ నాయక్‌కు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా విజయబాయికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

News March 9, 2025

4 రోజుల్లో కూతురి వివాహం.. తండ్రి మృతి

image

నాలుగు రోజుల్లో కూతురు వివాహం ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. మొండికుంటకు చెందిన రైతు చిన్న వెంకన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుభలేఖలు పంచి ఇంటికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగారు. కాగా ఈ నెల 12న జరగాల్సిన వివాహం వాయిదా పడింది.

News March 9, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

బయ్యారం మం. మిర్యాలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్‌, విజయ్‌ బైక్‌పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్‌ అదుపు తప్పి కళ్యాణ్‌‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్‌ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్‌కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.

News March 9, 2025

చింతకాని : యువతి అదృశ్యం… కేసు నమోదు

image

చింతకానికి చెందిన ఓ యువతి ఈ నెల7 నుంచి కానరాకుండా పోవడంతో అమెతండ్రి ఫిర్యాదు మేరకుపోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు కోదాడకు చెందిన ఓ యువకుడితో గత నెల 24 నిశ్చితార్థం జరిగింది. పెళ్లికోసం ఇంట్లో దాచిన రూ. 2.50 లక్షలుతీసుకోని వెళ్లిపోగా, ఎక్క డ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  నాగుల్ మీరా తెలిపారు.

News March 9, 2025

ఖమ్మం జిల్లాలో శనివారం 19,345 కేసుల పరిష్కారం

image

ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వరంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 19,345 కేసులు పరిష్కారమయ్యాయి. 62మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2,71,77,000 నష్ట పరిహారాన్ని ఇప్పించారు. ప్రి-లిటిగేషన్ 18, క్రిమినల్ 643, సివిల్ 51, చెక్ 2,318, వివాహం 6, సైబర్ 78, ట్రాఫిక్ చలానాలు 16,169 పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయమూర్తి తెలిపారు.