India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహిళలను అభివృద్ధిపథంలో నడిపించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని Dy.Cm భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా శక్తి సభలో Dy.Cm మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల గురించి మర్చిపోయిందని మండిపడ్డారు. గత కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి రైల్వే ప్రాజెక్టుల మంజూరు, సారపాక (భద్రాచలం) వరకు తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ అందించారు. పాండురంగాపురం -మల్కాన్‌గిరి రైల్వే లైన్ మంజూరు పట్ల తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలానికి తరలి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం లభిస్తుందని, యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

✓కారేపల్లి: బోరు వినియోగిస్తున్న ముగ్గురిపై కేసు ✓సత్తుపల్లి: డ్రైవర్ చాకచక్యం.. తప్పిన పెనుప్రమాదం ✓ఖమ్మం: మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి పువ్వాడ ✓ఖమ్మం: మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు:Dy.Cm భట్టి ✓ పెనుబల్లి:బైకుల ధ్వంసం.. తండ్రీకొడుకులపై కేసు నమోదు:ఎస్ఐ వెంకటేష్ ✓కల్లూరు: రూ.54 లక్షలు గోల్మాల్.. అధికారుల స్పందన ✓ జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ సంబురాలు.

√:ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు√:శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం √:ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన √:మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √:సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన √:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు√:నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √:ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈరోజు, రేపు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. పైలెట్ ప్రాజెక్టుగా మధిర మండలం మడుపల్లి గ్రామాన్ని ఎంపిక చేసింది. మడుపల్లిలో నాలుగు ఎకరాల్లో రూ.3.50 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా హైదరాబాదు నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

ఖమ్మం: మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూసుమంచి క్యాంప్ ఆఫీస్‌లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. జిల్లాలో రైతులు వేసిన పంటలో ఒక్క ఎకరం కూడా ఎండి పోవద్దని, పంట పొలాలకు అవసరమైన నీరు ప్రణాళికాబద్ధంగా రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

∆} సత్తుపల్లి:సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యం: ఎమ్మెల్యే రాగమయి∆}తెలంగాణ చిన్న తిరుపతి దేవస్థానంలో మంత్రి తుమ్మల, ఎంపీ∆} వైరా:రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు మృతి ∆} సత్తుపల్లిలో ఏన్కూరు వాసులకి రోడ్డు ప్రమాదం∆} సీఎం పేరు మర్చిపోయిన వైరా ఎమ్మెల్యే ∆} కూసుమంచి :భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి ∆} ఖమ్మం: ఇనుప రైలింగ్ తొలగించిన పుర అధికారులు

ఖమ్మం: జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (T.C.C) పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి సోమశేఖర శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా ఫలితాలను వెబ్సైట్ www.bse.telangana.gov.in నందు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని డీఈఓ పేర్కొన్నారు.

ఖమ్మం: పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా తులం బంగారం హామీ లేట్ అవుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.