Khammam

News July 5, 2024

నాగపూర్-అమరావతి హైవేపై హైకోర్టు స్టే

image

నాగపూర్ నుంచి అమరావతి వరకు నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ హైవేపై హైకోర్టు గురువారం స్టే విధించిందని పిటిషన్ దాఖలు చేసిన రైతులు వెల్లడించారు. ఎన్హెచ్ 163-జీ పేరుతో నిర్మిస్తున్న ఈ హైవేకు సంబంధించి తీర్థాల నుంచి వి వెంకటాయ పాలెం సెక్షన్లో 29 మంది రైతులు, ప్లాట్ల యజమానులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తమ భూములను స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.

News July 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
∆}ఎమ్మెల్యే పాయం పర్యటన పర్యటన వివరాలు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కొత్తగూడెంలో పవర్ కట్

News July 5, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 3రోజుల వరుస సెలవులు రానున్నాయి. అమావాస్య కావడంతో ఇవాళ, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. రైతులు ఈ మూడు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకురావద్దని అధికారులు తెలిపారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని తెలిపారు.

News July 4, 2024

దొడ్డి కొమరయ్య ఆశయాలను కొనసాగించాలి: డిప్యూటీ సీఎం

image

ఖమ్మం: కామ్రేడ్ దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రజలు కొనసాగించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, కొమరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

News July 4, 2024

ఖమ్మం: మహిళపై కత్తితో దాడి

image

చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో శిరీష (26) అనే మహిళపై పావని అనే మహిళ కత్తితో దాడి చేసింది. శిరీష‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శిరీష‌తో తన భర్త దుర్గాప్రసాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో శిరీషపై పావని దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.

News July 4, 2024

KMM: ఆర్టీసీలో కొలువుల జాతర, తగ్గనున్న భారం

image

సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 డిపోల్లో సుమారు 2,115, మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు

News July 4, 2024

మూడు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

image

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

News July 4, 2024

ఖమ్మం: అంగన్వాడీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

image

ఖమ్మం జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలకు గాను 96 టీచర్ల పోస్టులు, 395 ఆయాల పోస్టులు గతంలోనే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయిన వారితో కలిపితే 117 టీచర్, 599 ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సమీక్షలో ఉన్నతాధికారులు వెల్లడించారని జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్ రెడ్డి తెలిపారు.

News July 4, 2024

విలీన మండలాల సాధన కోసం దీక్ష చేయండి: డిప్యూటీ భట్టి

image

బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఏడు మండలాల సాధన కోసం దీక్ష చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాలు విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఆ మండలాలను విలీనం చేసిందని విమర్శించారు. పార్లమెంటులో బీజీపీ – బీఆర్ఎస్ ఒప్పంద మేరకే మండలాల విలీనం జరిగిందని చెప్పారు.

News July 4, 2024

కిన్నెరసానిలో భారీ చేప.. కొనేందుకు పోటీ

image

కిన్నెరసానిలో వేటకు వెళ్లిన జాలర్లకు 12 కిలోల భారీ చేప (బొచ్చె రకం) చిక్కింది. దాన్ని పాల్వంచ మార్కెట్లో విక్రయానికి పెట్టారు. భారీ చేపను దక్కించుకునేందుకు పలువురు పోటీపడ్డారు. కిలోకు రూ.200 చొప్పున వెచ్చించి ఒకరు కొనుగోలు చేశారని అని జాలర్లు వెల్లడించారు. కాగా కొన్ని రోజులుగా కిన్నెరసానిలో భారీగా చేపలు లభ్యమవుతున్నాయి అని తెలిపారు.