India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ ప్రభుత్వానికి రైతుల పైన లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బుధవారం మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డితో కలిసి కురుమూర్తి జాతరకు వెళుతున్నా ఆయన మార్గమధ్యలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇస్తామన్న 500 బోనస్ బోగస్ పథకంగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని మండిపడ్డారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25 తేదీన జరగాల్సిన డిగ్రీ మొదటి, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.వాయిదా పడ్డ పరీక్ష టైం టేబుల్ త్వరలో తెలియజేస్తామని తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత రెండు సంవత్సరాల నుంచి సిబ్బందికి బయోమెట్రిక్ విధానంలో హాజరు అమలు చేస్తున్నారు. కానీ కొన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో హాజరు నమోదు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు ఏర్పడుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని సిబ్బంది కోరుతున్నారు.
జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు ఇన్ఫ్లో తగ్గుతుంది. మంగళవారం 4,880 క్యూసెక్కులు ఉండగా నేడు 3,523గా ఉంది. బుధవారం 5,691 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పవర్ హౌస్‌కు 317 నెట్టెంపాడు 750 ,బీమా 650 ఎడమ 730, కుడి 530, ప్యారేలాల్ కెనాల్ 950, మొత్తం అవుట్ ఫ్లో 3,998 క్యూసెక్కులు బయటకు నీరు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొత్త అధ్యక్షరాలిని నియమించాలని ఇటీవల ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా గద్వాల మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యకు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితను రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది.
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ దిగువ నుంచి స్వామి వారి సన్నిధి వరకు ప్రధాన మెట్లపై క్యూలైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకున్నారు. కొండ దిగువన ముఖద్వారం వద్ద భక్తులు కార్తీకదీపం వెలిగించి కురుమయ్యను సల్లగా చూడవయ్యా అంటూ వేడుకున్నారు.
పాలమూరు యూనివర్సిటీ PHD సెల్ కో-ఆర్డినేటర్‌గా సూక్ష్మ జీవ శాస్త్రం విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్‌ను నియమిస్తూ వీసీ ప్రొ. శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ కిషోర్ గతంలో చీఫ్ వార్డెన్‌గా, సంయుక్త సంచాలకులుగా, పాలకమండలి సభ్యులుగా, ప్రిన్సిపాల్‌గా, విభాగాధిపతిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణలో స్థానిక సంస్థలలో కల్పించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుంచి అభ్యర్థనను స్వీకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఈనెల 22న మహబూబ్‌నగర్ ఐడీఓసీ కార్యాలయానికి రానున్నారని వనపర్తి జిల్లా బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన బీసీ సంఘాల సభ్యులు అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
నారాయణపేటలో ఈనెల 20న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సంగీత నాటక అకాడమి ఛైర్మెన్ సంగీత పుంజాల ఆధ్వర్యంలో అంజనా ఫంక్షన్ హాలులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సౌండ్, లైటింగ్, కళాకారులు బస చేసేందుకు వసతులు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం MPW వర్కర్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మల్టీపర్పస్ వర్కర్స్ ప్రతి ఒక్కరు గ్రామ కృషి చేయాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేటట్టు కృషి చేయాలని చెప్పారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.