India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TGPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో పాలమూరు జిల్లాపై ప్రశ్నలు వచ్చాయి. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సభ్యులు, గంగాపూర్, మన్యంకొండ, పిల్లలమర్రి దేవాలయాలు, సురవరం ప్రతాపరెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి, గోరేటి వెంకన్న, కిన్నెర మొగులయ్య, నాగం జనార్దన్ రెడ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితిపై పలు ప్రశ్నలు వచ్చాయి. తమ ప్రాంతం నుంచి ప్రశ్నలు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఇవాళ ఆమె సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలతో పాటు వైద్య సదుపాయాలను కల్పించినట్లు ఆమె తెలిపారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు అనేది తెలియదని, శ్రీహరికి మంత్రి పదవి రావడం మాత్రం ఖాయమని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో వరి విత్తనాలు ఉన్నాయని విత్తన సరఫరా విభాగం అధికారులు రామకృష్ణ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. RNR 15048 రకం అందుబాటులో ఉన్నాయని, 20 కేజీల ప్యాకెట్ ధర రూ.1060 అందజేస్తున్నట్లు తెలిపారు. కావలసిన రైతులు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. జూబ్లీహిల్స్‌లో భరణి లేఅవుట్‌లో ఆయన ఇంట్లో రూ.7.5 లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులకు జైపాల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యార్థులు అనేక కారణాలతో చదువులకు దూరమైతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ 57, SSC 57 స్టడీ సెంటర్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అడ్మిషన్లు పొందిన వారికి ప్రభుత్వమే పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. నేడు(సోమవారం) ఫైన్‌తో స్పెషల్ అడ్మిషన్లు పొందవచ్చని ఆయా పాఠశాలల అధికారులు తెలిపారు.
తొలిరోజు జరిగిన గ్రూప్ -2 పరీక్ష సెకండ్ పేపర్‌లో పాలమూరు బిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యపై ప్రశ్న వచ్చింది. ‘పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య దీనిని పునరుజ్జీవింప జేయడానికి చేసిన కృషికి ప్రసిద్ధి’ అని ప్రశ్న అడిగారు. మొగులయ్యపై ప్రశ్న రావడంతో జిల్లా వాసులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొగులయ్య స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట.
భారతదేశ తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వల్లభాయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. దేశానికి ఏకత్వం, సామాజిక సంస్కరణలు అందించిన విజన్ ఉన్న నాయకుడు వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీంతో ఉమ్మడి జిల్లాలోని నిరుపేదల సొంతింటి కల తీరనుంది. మొదటి విడతలో దాదాపు 49వేల మందికి లబ్ధి చేకూరనుంది. స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 36.14 లక్షల జనాభా ఉండగా.. 2,43,796 కుటుంబాలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నాయి. ఇందులో అత్యధికంగా NGKL జిల్లాలో 70,025 కుటుంబాలు ఉన్నాయి. అధికారుల ఇంటింటి సర్వేతో జిల్లాలోని లబ్ధదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేతో పాటు డాటా ఎంట్రీ కూడా పూర్తయింది. దీంతో రిజర్వేషన్లు మార్పులు జరిగే అవకాశం ఉంది. జనవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. MBNR-441, NGKL-464, GDWL-255, WNPT-260, NRPT-280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ఆయా రాజకీయ నేతలు, కార్యకర్తలు కార్యకలాపాలు చేపట్టి, అందరిని పలకరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.