India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని MBNR అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ <<15332056>>రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.

మహబూబ్ నగర్ విద్యా నిధికి మంచి స్పందన వస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ విద్యా నిధి చెక్కులను దాతలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయికి అందించారు. జనవరి నెలలో మొత్తం సుమారు రూ.8 లక్షల 50 వేలు వచ్చాయని, ఈరోజు రూ.3 లక్షల 37 వేలు విద్యా నిధికి సంబంధించిన చెక్కులను కలెక్టర్‌కి అందించారని ఆయన అన్నారు.

ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి-ఫార్మసీ సెమిస్టర్-3 పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బార్కోడ్స్‌పై వివరాలు సరిచూసుకోవాలని, పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.