Mahbubnagar

News August 11, 2024

మన జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లి లో 30.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 20.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 16.5 మిల్లీమీటర్లు, చిన్నజట్రంలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 11, 2024

MBNR: నాలుగేళ్లు ప్రేమ.. పెళ్లి చేసుకోకుండా మోసం !

image

ప్రేమపేరుతో ఓ యువతిని మోసం చేసిన ఘటన నవాబ్ పేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ ముస్తఫా అనే యువకుడు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. తాజాగా మతం అడ్డొస్తుందని పెళ్లి చేసుకోకుండా యువతి మోసం చేశాడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు.

News August 11, 2024

మహబూబ్‌నగర్: మాకెప్పుడూ రుణమాఫీ..?

image

రూ.2లక్షల రుణమాఫీపై ఉమ్మడి పాలమూరుకు చెందిన రైతుల్లో గందరగోళం నెలకొంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ కొందరు రైతుల నుంచి వ్యవసాయ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. మరోవైపు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ.. తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా మాఫీ ఎందుకు కాలేదని నిలదీస్తున్నారు. దీనిపై అధికారులు, బ్యాంకర్ల నుంచి సరైన సమాధానం లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News August 11, 2024

దేశంలోనే 3వ స్థానంలో ఉన్న పిల్లలమర్రి ప్రత్యేకత!

image

పిల్లలమర్రిచెట్టు మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు.సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది.
దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.

News August 11, 2024

MBNR: అనుమానాస్పదంగా ట్రాన్స్‌జెండర్ మృతి

image

అనుమానాస్పదంగా ట్రాన్స్‌‌జెండర్ మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. SI విజయ్ భాస్కర్ వివరాలు.. బిజినేపల్లి మం. నందివడ్డేనాన్ వాసి నరేందర్ 5ఏళ్ల క్రితం ట్రాన్స్‌‌జెండర్‌(నాగశ్రీ)గా మారారు. MBNRలో అద్దె గదిలో ఉంటూ భిక్షాటన చేస్తుంది. గతేడాది ఆటో డ్రైవర్ రమేశ్‌ను పెళ్లి చేసుకున్న ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 11, 2024

మన్యంకొండలో భక్త జనసందోహం

image

పేదల తిరుపతి మన్యంకొండకు భక్తులు పోటెత్తారు. ఈనెల 5 నుంచి మన్యంకొండలో శ్రావణ మహోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలి శనివారం కావడంతో ఉమ్మడి పాలమూరు నుంచే కాగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని ఆలయ అధికారులు తెలిపారు.

News August 11, 2024

అచ్చంపేట: ఉమామహేశ్వర ఆలయ ప్రత్యేకత!

image

నల్లమల అటవీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలో మిళితమై ఉంటుంది. ఇచ్చట సంవత్సరంమంతా కూడా నీరు కొండలో నుంచి ఎప్పటికి సజీవజలంలా జాలువారుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ప్రక్కృతి ఒడిలో నుండి వచ్చిన స్వచ్ఛమైన పవిత్ర శైవక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ప్రకృతి రమణీయత అద్భుతం.

News August 10, 2024

NGKL: సొంత ఊరిపై మమకారం చూపిన కల్కి డైరెక్టర్

image

జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా పుట్టిన ఊరు, కన్నతల్లిని ఎప్పటికీ మరచిపోకూడదని కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలంలోని ఐతోల్‌లో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సొంత గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.66 లక్షల నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్, MLAతో నాగ్ అశ్విన్ కలిసి ప్రారంభించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అన్నారు.

News August 10, 2024

సోమశిలలో బ్రహ్మానందం సందడి

image

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో కామెడీ స్టార్ బ్రహ్మానందం సందడి చేశారు. శ్రీలలిత సోమేశ్వరాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమశిల అందాలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లమల ప్రకృతి అందాలు చాలా బాగున్నాయని, తనకెంతో నచ్చాయన్నారు. బ్రహ్మానందంతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. 

News August 10, 2024

MBNR: నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ

image

మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల BC నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి శిక్షణ కొరకు www.tgbcstudycircle.cgg.gov.in ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ అధికారులు ఇందిర, స్వప్న తెలిపారు. 18-25సం|| లోపు ఉండాలని, SSC, INTER, ITI &DIPLOMA పాసై ఉండాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు TGBC స్టడీ సర్కిల్ ద్వారా HYDలో శిక్షణ, నెలకు రూ.4వేల స్టైఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు.