Mahbubnagar

News November 14, 2024

నాగర్‌కర్నూల్: ఆర్మీ జవాన్ సూసైడ్

image

బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శివాజీ(28).. వారం క్రితం డ్యూటీ నుంచి సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. అందరితో స్నేహంగా ఉండే శివాజీ మృతి తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 14, 2024

పాలమూరులో ఫోన్ ట్యాపింగ్ కలకలం

image

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఉన్నతాధికారులనే విచారించగా తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. విచారణలో భాగంగా జిల్లాకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఫోన్ ట్యాపింగ్‌కు సహకరించిన ఆధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై గతంలో MBNR ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News November 14, 2024

లగచర్ల ఇష్యూ.. ఈ మండలాల్లో ఇంటర్నెట్ బంద్!

image

కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. గ్రామం నిర్మానుష్యంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా దుద్యాల, కొడంగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో BRS నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో నిరసనలు తెలిపారు.

News November 13, 2024

అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ

image

అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.

News November 13, 2024

లగచర్ల దాడిలో 16 మంది అరెస్టు..

image

కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల దాడిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో అధికారులపై దాడికి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దీని తరువాత కొడంగల్ మెజిస్ట్రేట్‌లో హాజరు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

News November 13, 2024

కురుమూర్తి స్వామి హుండీ ఆదాయం @రూ.25,54,805

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద జాతర అయిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీని మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.25,54,805 వచ్చినట్లు ఈవో మధుమేశ్వరరెడ్డి చెప్పారు. ఈ బ్రహోత్సవాల్లో హుండీ లెక్కింపు ఇది తొలిసారి. అయితే ఉత్సవాలు ముగిసే వరకు మరో రెండుసార్లు లెక్కించే అవకాశం ఉంది. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారుల పర్యవేక్షణలో ఆదాయం లెక్కింపు జరిగినట్లు ఈవో తెలిపారు.

News November 13, 2024

మహిళలకు రక్షణ భరోసా కేంద్రాలు: డీకే అరుణ

image

భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. షీటీం ఆధ్వర్యంలో మంగళవారం MBNRలోని మోనప్పగుట్టలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో MP పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల, బాలల రక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, MLA శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర, SP జానకి పాల్గొన్నారు.

News November 13, 2024

MBNR: గ్రూప్-3 పరీక్ష సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 17,18 తేదీలలో నిర్వహించే గ్రూప్-3 పరీక్ష జిల్లాలో సజావుగా నిర్వహించాలని MBNR అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీస్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. MBNR, దేవరకద్రలలో 52 పరీక్షా కేంద్రాల్లో 19,465 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు.

News November 12, 2024

వెల్దండ: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

image

వెల్దండ మండలం మహాత్మాగాంధీ తండా సమీపంలో వారం రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసును పోలీసులు చేధించారు. రాజు అనే వ్యక్తిని అతని భార్య హిమబిందు, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు.

News November 12, 2024

MBNR: ఈనెల 15న ఉమ్మడి జిల్లా బాక్సింగ్ ఎంపికలు

image

MBNR జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 8-14, అండర్-17 విభాగాల బాలబాలికల బాక్సింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే వారు పాఠశాల బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉ.10 గంటలకు హాజరు కావాలని కోరారు.

error: Content is protected !!