India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✔Way2Newsతో SBI, SBRSETI డైరెక్టర్
✔ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ డీకే అరుణ
✔FBR 7నుంచి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు
✔తగ్గిన చలి.. పెరిగిన ఉష్ణోగ్రతలు
✔సీఎం,MLAల చిత్రపటానికి పాలాభిషేకం
✔UPS విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
✔మరికల్:వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష
✔మక్తల్: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే
✔దామరగిద్ద: అనుమానాస్పద స్థితిలో..చిరుత మృతి

తెలంగాణ తిరుపతిగా భావించే మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రంగరంగ వైభవంగా మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

యాద్గిర్లో కర్ణాటక హోమ్ మినిస్టర్ డా. జి. పరమేశ్వర, పరిశ్రమల మంత్రి శరణబసప్పను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాల పై చర్చించారు. అనంతరం భోజనం చేశారు. యాద్గిర్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి పాటిల్ తున్నూర్, షోరాపూర్ ఎమ్మెల్యే రాజా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అంతటి రజిత భర్త మల్లేష్ పై సోమవారం రైతులు దాడి చేశారు. అంతకంటే ముందు వ్యవసాయ మార్కెట్‌ను ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో అచ్చంపేటలో ఉద్రిక్తత నెలకొంది. తాము పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని వారు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్సై రమేష్ ఘటనా స్థలికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సింగం దాస్ నర్సింహులు అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. నరసింహులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ఈఎంటీ రాజేందర్, పైలెట్ శ్రీనివాసులు, జడ్చర్ల మండలంలోని 108 పైలట్ రాంరెడ్డి, అడ్డకల్ అంబులెన్స్ ఈఎంటీ నాగరాజు, పైలట్ కిషోర్ ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ప్రశంసా పత్రాల్ని అందించారు.

రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు లచ్చన్న దళం మావోయిస్టుల పేరుతో లేఖను అతికించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటికి మరోసారి లచ్చన్న దళం పేరుతో లేఖ రాశారు. ‘ఎమ్మెల్యేగా మంచిగా వ్యవహరించు.. గర్వం ఉంటే ఎప్పటికీ మంత్రి కాలేవు. దయచేసి జాగ్రత్తగా ఉండు. ఇట్లు లచ్చన్న దళం’ అంటూ లేఖలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

ఉమ్మడి బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారి ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 12,13,14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్రీడా మైదానంలో రూ.13 లక్షలతో నిర్మించిన డ్రెస్సింగ్ (కబడ్డీ క్రీడాకారిణిలకు) రూమ్, క్రీడా సామగ్రి స్టోర్ రూమును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులను పరిచయం చేయాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.