Mahbubnagar

News July 5, 2024

పీయూకి రూ.100 కోట్లు వచ్చాయి

image

పాలమూరు యూనివర్సిటీకి పెద్ద మొత్తంలో ఫండ్స్ వచ్చాయి. ప్రధాన మంత్రి శిక్ష ఉచ్ఛతర్ అభియాన్(పీఎంయూఎసెచ్ఎ) పథకం కింద రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.78 కోట్లు కొత్త హాస్టళ్లు, బిల్డింగుల కోసం ఖర్చు చేయనున్నారు. భవనాలు, ఇతర మైనర్ రిపేర్ల కోసం రూ.3.60 కోట్లు, ల్యాబ్ లలో అత్యాధునిక పరికరాల కోసం రూ.14.26 కోట్లు, రీసెర్చ్, బోధన, శిక్షణ తదితర వాటి కోసం 3.22 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.

News July 5, 2024

వనపర్తి: బాలికపై బాబాయి అత్యాచారం

image

వనపర్తి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలికపై సొంత చిన్నాన్నే(20) అత్యాచారానికి పాల్పడ్డాడు. SI మంజునాథ్ రెడ్డి వివరాలు.. కొత్తకోటకు చెందిన దంపతులు ముగ్గురి పిల్లలను బంధువుల వద్ద పెట్టి వలస వెళ్లారు. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లల వద్దకు వచ్చిన చిన్నాన్న పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడగా కేకలు వేసింది. ఇద్దరు చెల్లెళ్లు ఏడ్చుకుంటూ వచ్చి స్థానికులకు చెప్పారు. నిందితుడు పారిపోగా కేసు నమోదైంది.

News July 5, 2024

NGKL: పిల్లలు పుట్టడం లేదని మహిళ సూసైడ్

image

పిల్లలు కావడంలేదని ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. చారకొండ మండలం శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)కి APలోని కంభంపాడుకు చెందిన శేషుతో 2014లో పెళ్లైంది. పిల్లలు కాకపోవడంతో దంపతులు తరచూ గొడవ పడేవారు. ఆమె 3నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. బుధవారం భర్తకు ఫోన్‌ చేసి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయంది. ఘటనపై నిన్న కేసు నమోదైంది.

News July 5, 2024

MBNR: ITI రెండు విడత దరఖాస్తులకు ఆహ్వానం

image

ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ డీజిల్, టర్నర్, మిషనిస్టు, కోపా తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులు ఈనెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News July 5, 2024

నేడు నల్లమలలో మంత్రి, ఎమ్మెల్యేలు పర్యటన

image

అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం గుర్తించిన అక్కమాంబ గుహలు, కదిలి వనం, అక్టోపాస్ వ్యూ పాయింట్, టూరిజం స్పాట్లను సందర్శించానున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News July 5, 2024

MBNR: బడికి వెళ్లే బాలికకు వివాహం.. కేసు నమోదు

image

బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. SI శేఖర్‌రెడ్డి వివరాలు.. గండీడ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీరప్ప అదే గ్రామానికి చెందిన 6వ తరగతి బాలికను జూన్‌లో పెళ్లి చేసుకున్నాడు. వారం క్రితం బాలిక స్కూల్‌కి వెళ్లగా పెళ్లైనట్లు గుర్తించిన టీచర్ అధికారులకు సమాచారమిచ్చారు. విచారించిన అధికారులు.. బాలికను స్టేట్‌ హోంకు తరలించారు. యువకుడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.

News July 5, 2024

ధరణి పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం వెబ్ ఎక్స్ ద్వారా తహశీల్దార్లతో సమీక్షించారు. గత నెల 29 నుంచి నేటి వరకు ఉన్న దరఖాస్తులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నవి తహశీల్దార్‌లను ఆమె అడిగి తెలుసుకున్నారు. CCLA ప్రతిరోజు మానిటర్ చేస్తున్నందున దరఖాస్తులను పరిశీలించి అప్‌లోడు చేయాలని పేర్కొన్నారు.

News July 4, 2024

విద్యా సంస్థలు బంద్ విజయవంతం: SFI

image

నీట్ పరీక్షల ఫలితాలలో అవకతవకల నేపథ్యంలో నేడు దేశం మొత్తం విద్యాసంస్థలకు బంధు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో SFI, PDSU, NSUI, AISF, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం చేశామని ప్రశాంత్ తెలిపాడు. NTA సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

News July 4, 2024

MBNR: మండల పరిషత్తులకు స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే!1/2

image

✒MBNR-జిల్లా ప్రణాళిక అధికారి దశరథ్ ✒అడ్డాకుల-జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ✒బాలానగర్-జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం బాబురావు ✒భూత్పూర్-జిల్లా హర్టీకల్చర్, సెరీకల్చర్ అధికారి కె.వేణుగోపాల్ ✒సీసీ కుంట-జిల్లా యువజన,క్రీడల అధికారి ఎస్. శ్రీనివాస్ ✒దేవరకద్ర-స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి ✒హన్వాడ-DRDO పి.నర్సింహులు ✒జడ్చర్ల-RDO నవీన్ ✒గండీడ్-SC సంక్షేమ శాఖ డీడీ వి.పాండు

News July 4, 2024

MBNR: మండల పరిషత్తులకు స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే!2/2

image

✒రాజాపూర్-జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్.ఇందిర ✒నవాబు పేట-జిల్లా సహకార అధికారి ఎ. పద్మ ✒మూసాపేట-జిల్లా మత్స్యశాఖ అధికారి రాధారోహిణి ✒మిడ్జిల్-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. వెంకటేశ్ ✒కోయిలకొండ-జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బి.మధుసూదన్ గౌడ్ NOTE:నేటి నుంచి నుంచి ఆయా మండలాలకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు జారీ చేశారు.