Mahbubnagar

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. పాలమూరు REPORT

image

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి MBNRలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, కొడంగల్‌‌లో ‘కడా’ ఏర్పాటు, కురుమూర్తి ఆలయ ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి రూ.110కోట్లతో శంకుస్థాపన, జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటన, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?

News December 7, 2024

ఇటుకలతో నిర్మించిన పురాతన గొల్లత్తగుడిని చూసొద్దామా..?

image

జడ్చర్ల గ్రామీణ మండలం అలావానిపల్లి గ్రామంలో గొల్లత్తగుడి 8వ శతాబ్దపు ఆలయం.1149-1162 కాలంలో చాళుక్య రాష్ట్ర కూట రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారు జైన, బౌద్ధ మతాలను ఆదరించారు. అప్పట్లోఈ గ్రామం జైనమత కేంద్రంగా వర్ధిల్లింది. జైన ఆలయం 65 అడుగులు ఉంటుంది. ఇటుక పై ఇటుక పేర్చి సిమెంటు, మట్టి ఉపయోగించకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని చరిత్రాత్మక ఆలయంగా కేంద్ర పురావస్తు శాఖ గుర్తించింది.

News December 7, 2024

శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన హీరో నాగార్జున

image

శ్రీశైలం డ్యామ్‌ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున శుక్రవారం సందర్శించారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో డ్యామ్ వద్ద కాసేపు ఆగారు. జలాశయం అందాలను తిలకించారు. డ్యామ్ వద్ద ఉపాధి పొందే పలువురు ఫొటోగ్రాఫర్లు నాగార్జునతో ఫొటోలు దిగారు. అంతకుముందు నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.

News December 6, 2024

వనపర్తి: కూతురు మరణం.. గుండెపోటుతో తండ్రి మృతి

image

వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో కూతురు చనిపోగా అది తట్టుకోలేని ఆ తండ్రి గుండె ఆగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖిల్లా ఘనపూర్‌లో నివాసముంటున్న దేవరశెట్టి శ్రీనివాసులు 17ఏళ్ల కుమార్తె వైశాలి అనారోగ్యంతో గురువారం చనిపోయింది. బిడ్డ మృతిని తట్టుకోలేని విలపిస్తున్న శ్రీనివాసులు కూతురు మృతదేహంపై పడి గుండెపోటుతో మృతిచెందారు. ఒకే రోజు తండ్రీకుతూరు మృతి స్థానింకగా కలిచివేసింది.

News December 6, 2024

MBNR: నియామక పత్రాలు అందజేయండి !

image

TGPSC ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో JL గా ఎంపికైన అభ్యర్థులు తమకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొందలకుంట గ్రామానికి చెందిన జయరాములు, మొల్గర గ్రామానికి చెందిన మహేశ్, చందాపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తెలుగు అధ్యాపకులుగా ఎంపికయ్యారు. నియామక పత్రాలు వెంటనే అందజేసి ఇంటర్ విద్యలో తమను భాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News December 6, 2024

వనపర్తి: నేడు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కళా ప్రదర్శనలు: కలెక్టర్

image

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మెగా కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కళాకారుడు డప్పుల నాగరాజు సారథ్యంలో వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News December 5, 2024

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం: సీఎం రేవంత్

image

సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా సహచర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లతో పేదల కలను సాకారం చేయడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

News December 5, 2024

జడ్చర్ల: బాలికను గర్భవతిని చేసిన యువకుడు

image

ఓ బాలిక(17)ను గర్భవతిని చేశాడు ఓ యువకుడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానంటూ తిరిగేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఆమెపై పలు సార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకొమని అడగగా మొహం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News December 5, 2024

నాగర్‌కర్నూల్: కుళ్లిపోయిన మహిళ మృతదేహం

image

అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసుల ప్రకారం.. NGKL జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన మరియమ్మ(40) తన భర్తతో భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఆమె కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా కుళ్లిన స్థితిలో మరియమ్మ మృతదేహం కనిపించింది. భర్తే హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

News December 5, 2024

GREAT: 4 ‘GOVT’ ఉద్యోగాలు సాధించిన మమత

image

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన గోపాల్ గౌడ్ కుమార్తె మమత నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో కేజీబీవీ లెక్చరర్‌గా, 2024లో గురుకుల జూనియర్ లెక్చరర్‌గా, ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించి గెజిటెడ్ పోస్ట్‌ను దక్కించుకుంది. భర్త సుకుమార్ గౌడ్ ప్రోత్సాహంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.