India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చీరకొంగులో చంద్రుడి సంస్కృత శ్లోకాలు.. చీర కొంగుపై గొల్లభామల నాట్యంతో వేసిన చీర.. కోట కొమ్మల పట్టుచీర ఇలా పలు రకాల చీరలను నేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన నైపుణ్యం గల ఏడుగురు నేతన్నలు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రేపు బుధవారం HYDలో జరిగే వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి నగదు, కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకోనున్నారు.
గోపాల్పేట్ మండల కేంద్రానికి చెందిన మూవీ డైరెక్టర్ జానకిరామ్ ఆర్థిక సమస్యలతో సోమవారం HYDలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జానకిరామ్ తమ్ముడు బాలకృష్ణ భావోద్వేగానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలిసింది. తమ్ముడు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అయోమయంలో పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారులు బదిలీపై వెళ్లగా నూతన అధికారులు మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ అధికారిగా సీహెచ్ రథసారథి, గద్వాల జిల్లాకు శ్యాంసుందర్, నారాయణపేటకు కృష్ణయ్య, నాగర్ కర్నూల్ జిల్లాకు రామ్మోహన్ రావు.. జిల్లా పంచాయతీ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనెల 7న జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. పద్మావతి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు హాజరు కావచ్చని తెలిపారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, మ్యాజిక్ బస్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏదైనా డిగ్రీలో 2019- 2024 వరకు ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలన్నారు.
తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణకు మహబూబ్ నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఆగస్టు 17న రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందని, అరుణాచలేశ్వరస్వామి గిరిప్రదక్షిణ పూర్తయ్యాక 19న మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగుపయనమవుతుందని, రూ.3,600 టిక్కెట్ ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 99592 26285, 94411 62588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
@ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం.@ మహిళలకు ఉచిత బస్సు కాదు రక్షణ కావాలి: మాజీ మంత్రి.@ కృష్ణమ్మకు మంత్రి జూపల్లి పూజలు.@ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే.@ షాద్నగర్ ఘటనపై విచారణ కమిటీని వేసిన సిపి అవినాష్ మహంతి.@ ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన శ్రావణమాస వేడుకలు.@TLF నూతన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వెంకటరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(TLF) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మోహన్ రెడ్డి, కరుణాకర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా విజేత వెంకట్ రెడ్డి, MBNR-మల్లేష్ , GDWL-డాక్టర్ మహేందర్,NGKL-సత్యం,NRPT-అశోక్ గౌడ్,WNPT-డాక్టర్ చంద్రశేఖర్ లను ఆయా జిల్లాలకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
DEECET-2024లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మొత్తం 1611 కాగా అందులో 1134 విద్యార్థులు తమ ధ్రువపత్రాలను ఆన్లైన్లో పొందుపరిచారని డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ మేరజులఖాన్ అన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో దాదాపు 70% ధ్రువపత్రాలను పరిశీలించామని, రేపటితో ఈ గడువు ముగుస్తుందని, మిగిలిన విద్యార్థులందరూ ధ్రువపత్రాలను పొందుపరచడానికి హాజరు కావాలన్నారు.
నాగర్కర్నూల్: జిల్లాకేంద్రంలో మరో వడ్డీ వ్యాపారి రూ.20కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన జహీర్ నాగర్కర్నూల్, తుడుకుర్తి, నడిగడ్డ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది నుంచి అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి రూ.20 కోట్లు వసూలు చేశాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలని బాధితులు కోరగా ప్లేట్ తిప్పేసి పరారయ్యాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Sorry, no posts matched your criteria.